కత్తి మహేష్ కు పవన్ కళ్యాణ్ అభిమానులు గట్టిగానే ఝలక్ ఇచ్చినట్టే కనిపిస్తున్నారు. టైమ్ దొరికితే చాలు ట్విట్టర్లో కూర్చొని పీకే ఫ్యాన్స్‌ను పవన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు కత్తి మహేష్. పీకేను తిట్టేందుకు ట్విట్టర్ ను బాగానే వాడుకున్నాడు. అలాంటిది అతని ఖాతాను ట్విట్టర్ తొలగించింది. తాము పెట్టిన రూల్సును అతిక్రమించడం వల్లే తొలగించినట్టు చెప్పింది. ఆ తొలగింపు వెనక పీకే ఫ్యాన్స్ కష్టం చాలా ఉందని సమాచారం.
బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చాడో లేదో కత్తి మహేష్ పవన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు. వచ్చిన కాస్త గుర్తింపును పెంచుకోవడం కోసమే అలా చేస్తున్నాడని అప్పట్లో చాలా మంది అనుకున్నారు. పవన్ ఫ్యాన్స్‌కు కత్తికి గట్టిగా ట్విట్టర్‌లో మాటల యుద్ధం అయింది. బయట దాడులు చేసే వరకు పరిస్థితి వెళ్లింది. మధ్యలో చల్లబడినా... శ్రీరెడ్డి వివాదంతో తిరిగి కత్తికి పీకే ఫ్యాన్స్ కు మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. ట్విట్టర్లో పవన్ పై ఏవో ఒక కామెంట్లు పెడుతూనే ఉన్నాడు కత్తి. చివరికి ఇప్పుడు ఖాతానే కోల్పోయాడు. కొన్నేళ్లుగా లక్షల్లో ఉన్న పీకే ఫ్యాన్స్ అతని ఖాతాపై ట్విట్టర్ కు ఫిర్యాదు చేయడమే కారణమని తెలుస్తోంది. ఎక్కువ మంది నుంచి ఫిర్యాదులు అందినప్పుడు ట్విట్టర్ ఆ ఖాతాను ఒకసారి పరిశీలించి తొలగిస్తుంది. కత్తిగారి ఎకౌంట్ తెరిస్తే చాలు నిత్యం బూతులు తిట్టుకోడాలు విమర్శించడాలే కనిపిస్తాయి. అందుకేనేమో రెండో ఆలోచన లేకుండా కత్తి ఎకౌంట్ లేపి పడేసింది ట్విట్టర్. పవన్ ఫ్యాన్స్ కు ఇది సంతోషాన్ని కలిగిస్తే ... కత్తికి మాత్రం దిమ్మతిరిగే షాక్ కొట్టింది.
కత్తి మాత్రం తక్కువా ఏంటీ? కాంట్రవెర్సీ సొంతంగా క్రియేట్ చేసే రకం. ట్విట్టర్ లో మరో ఖాతా క్రియేట్ చేసుకోలేడా? పాత ఖాతా బ్లాక్ అవ్వగానే కొత్త ఖాతాలను తెరిచేశాడు. తెరిచిన వెంటనే పవన్ ను తిట్టడం మొదలుపెట్టాడు. ఈ ఖాతాను కూడా పూర్తిగా పవన్ ను విమర్శించేందుకే అంకితం చేసేట్టే ఉన్నాడు.