సినీ నటుడు, సినీ విమర్శకుడు, 'బిగ్ బాస్' ఫేమ్ కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నెల్లూరు జిల్లా చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇనోవా కారు ఓ ట్రక్ ను బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో గాయపడిన కత్తి మహేష్ ను నెల్లూరులోని మెడికోర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
యాక్సిడెంట్ లో కత్తి మహేష్ తలకు బలమైన గాయాలు తగిలినట్లు మెడికోవర్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన్ను స్పెషల్ ఇసోలేషన్ లో వెంటిలేటర్ పై ఉంచిన వైద్యులు.. మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి మహేష్ ఆరోగ్యం విషమంగానే ఉందని.. ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. మరికొన్ని గంటలు మానిటర్ చేసిన తర్వాత కానీ హెల్త్ బులిటెన్ విడుదల చేయలేమని వైద్యులు తెలిపారు.
ప్రమాద సమయంలో కత్తి మహేష్ తో పాటు ఆయన డ్రైవర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతోనే ఆయన్ని కత్తి మహేష్ గా పోలీసులు గుర్తించారు. వెంటనే నెల్లూరులోని మెడికోర్ హాస్పిటల్ కి తరలించారు. మహేష్ స్నేహితులు, బంధువులు కూడా ఆసుపత్రికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కత్తి మహేష్ రోడ్ యాక్సిడెంట్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.