క్యాట్.. ఈ ట్రైయాంగిల్ కథేంది నానా?

Update: 2016-12-21 17:30 GMT
బాలీవుడ్ హార్ట్ త్రోబ్ రణబీర్ కపూర్- కత్రినా కైఫ్ కి బ్రేకప్ అయిపోయిందనే విషయం గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. కమిటయ్యారు కాబట్టి ఇష్టం లేకపోయినా ఇద్దరూ కలిసి జగ్గా జాసూస్ కోసం కలిసి పని చేస్తున్నారు. షూటింగ్ లో ఎడామొహం పెడమొహంగా ఉంటున్నారని టాక్. మరి టాటా బైబై చెప్పేసుకున్నాక పర్సనల్ లైఫ్లో లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి..? ఇద్దరూ కొత్త పార్టనర్స్ ని చూసుకున్నారా.. ఇంకా సోలోగానే ఉన్నారా అంటే.. రణబీర్ ప్రస్తుతానికి ఫ్యామిలీతో కనిపిస్తుంటే క్యాట్స్ మాత్రం ఇంకో బాయ్ ఫ్రెండ్ మీద మనసు పారేసుకోనే పనిలో ఉందంటున్నారు. కాకపోతే ఇదేదో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అంటున్నారు.

ఆ కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు.. మరో కుర్ర హీరో ఆదిత్యా రాయ్ కపూర్. ఆషికీ2 తో పాపులరైన ఆదిత్యాకి బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. హీరోయిన్ శ్రద్ధాకపూర్ తో లవ్ ఎఫైర్స్ తో వార్తల్లోనూ బాగా నానాడు. త్వరలో ఓకేజానూ అంటూ రాబోతున్నాడు. వీటంన్నిటికి మంచి రణబీర్ కపూర్ క్లోజ్ ఫ్రెండ్ గా కూడా ఆదిత్యా సూపర్ పాపులర్. ఎక్కువగా కలిసి కనిపించే రణబీర్- ఆదిత్యా బ్రోమాన్స్ యే జవానీ యే దివానీ మూవీతో పీక్స్ కెళ్లింది. అప్పటికి కత్రినా- రణబీర్ లవర్సే కాబట్టి కామన్ ఫ్రెండ్ గా ఆదిత్యా కూడా వాళ్ల లవ్ కి తనవంతు సాయం చేసేవాడు.  ఇక కత్రినా-ఆదిత్యా కలిసి ఫితూర్ అనే మూవీలో యాక్ట్ చేశారు. సినిమా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ.. కత్రినా- ఆదిత్యా చేసిన హాట్ హాట్ రొమాన్స్ మాత్రం టాక్ ఆఫ్ ద బాలీవుడ్ అయింది. రణబీర్ కత్రినాతో బ్రేకప్ చేసుకోడానికి ఫితూర్ లో రొమాన్స్ కూడా ఓ కారణమని కొంతమంది అంటే.. రణబీర్ మీదున్న కోపంతోనే కత్రినా తెగించిందనే వాళ్లూ ఉన్నారు.

ఇక కత్రినాకి రణబీర్ తో.. ఆదిత్యాకి శ్రద్ధాతో బ్రేకప్ అయిపోయింది. దీంతో ఒంటరిగా ఉన్న వీళ్లిద్దరూ ఇప్పుడు కొత్త ప్రేమ పక్షులుగా మారారని వినిపిస్తోంది. మరి కత్రినా కోసం ఆదిత్యా రణబీర్ ని వదులుకుంటాడా..? అసలు క్యాట్స్- ఆది మధ్య నిజంగా సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తుందా? అనే సందేహం మనకు వచ్చే లోపే.. ఆదిత్య మరో అమ్మడుతో కూడా కనిపిస్తున్నాడు. మరి ఈ ట్రైయాంగిల్ ప్రేమ కథ ఏంటనేదే ఎవ్వరికీ తెలియని విషయం.  అసలు ఏం  జరుగుతోంది క్యాట్??

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News