బాలీవుడ్ హీరోయిన్ లకు ఈ మధ్య రెమ్యూనరేషన్ పై మాట్లాడ్డం బాగా ఎక్కువ అయింది. ఓ సినిమాకి హీరోతో పాటు సమానంగా హీరోయిన్ కూడా కావాల్సినపుడు.. వారితో సమానంగా తమకు రెమ్యూనరేషన్ ఎందుకు ఇవ్వరని గోల చేస్తున్నారు. కంగనా రనౌత్ - దీపికా పదుకొనేలు ఇప్పటికే పబ్లిక్ స్టేట్ మెంట్లు కూడా ఇచ్చారు. మిగిలినోళ్లు సైలెంట్ గా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఈ వివాదానికి ఫితూర్ నిర్మాతలు చెక్ పెట్టాలని డిసైడ్ అయినట్లున్నారు. అందుకే హీరో ఆదిత్య రాయ్ కపూర్, హీరోయిన్ కత్రినకు సమానంగా పారితోషకం ఇచ్చారు. ఫితూర్ మూవీ కోసం ఇద్దరికీ చెరో నాలుగు కోట్లు ఇచ్చారు. అయితే.. ఇక్కడ ఆదిత్య కంటే కేట్ చాలా సీనియర్ అనే విషయాన్ని గుర్తించుకోవాలి. ఏదో ఒకటి చెప్పేసి సమాన అంటున్నారు కానీ.. వాస్తవం మాట్లాడుకుంటే.. ఇద్దరి మొహాల్లోనూ ఒక్క ఫీలింగ్ కూడా పలకదు. ఈమె గ్లామర్ తోనూ, డ్యాన్స్ తోనూ టాప్ హీరోయిన్ అంటోంది. పెద్ద ప్రొడ్యూసర్ కి తమ్ముడు కావడంతో. నెట్టుకొచ్చేస్తున్నాడు.
వీళ్లకే నాలుగేసి కోట్లు చెల్లించడం చూశాకే... మన టాలీవుడ్ లో కూడా ఈ తరహా వాదనలు మొదలయ్యాయి. కనీసం యాక్టింగ్ రానోళ్లకే ఇంతింత ఇచ్చేస్తున్నారు. తాము గ్లామర్ తో పాటు, పెర్ఫామెన్స్ కూడా చేస్తున్నామని రేటు పెంచాల్సిందే అని కాజల్, సమంత లాంటి హీరోయిన్లు వాదించడంలో. తప్పేం లేదని అనిపిస్తోంది. సౌత్ నిర్మాతలూ.. కాస్త మీరు కూడా ఏదో ఒక పరిష్కారం చూస్తే బెటర్.