టీనేజీ కుర్రాళ్ల‌ను వెంటాడే అంద‌మైన దెయ్యం

Update: 2022-10-04 23:30 GMT
దెయ్యం క‌థ‌ల‌తో చాలా సినిమాలొచ్చాయి. బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్నిచోట్లా హార‌ర్ చిత్రాల‌కు ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. ఇటీవ‌లే విజ‌యం సాధించిన 'భూల్ భుల‌యా 2' ఈ కేట‌గిరీకే చెందుతుంది. అంత‌కుముందు 'కాంచ‌న' సిరీస్ దెయ్యం కాన్సెప్టుతో వ‌చ్చి బంప‌ర్ హిట్ సాధించింది. హిందీలోనూ ఈ సిరీస్ రీమేకై ఆక‌ట్టుకుంది.

ఇప్పుడు బాలీవుడ్ లో మ‌రో దెయ్యం సినిమా వ‌స్తోంది. అయితే ఈసారి దెయ్యంగా న‌టిస్తున్న‌ది మాత్రం ఆషామాషీ అందం కాదు. సాటి ఆడ దెయ్యానికి అయినా షివ‌రింగ్ పుట్టించే అందం ఆమెది. ఇంత‌కీ ఎవ‌రీ ఘోస్ట్? అంటే ది గ్రేట్ క‌త్రిన కైఫ్‌. సిద్ధాంత్ చతుర్వేది - ఇషాన్ ఖట్టర్ లాంటి కుర్ర‌హీరోల‌ను వెంబ‌డించే ఘోస్ట్ పాత్ర‌లో క‌త్రిన న‌టించింద‌ని తెలిసింది. ఇది హార‌ర్-కామెడీ మూవీ.. ఫోన్ బూత్ అనేది టైటిల్. ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తోంది.

కత్రిన- సిద్ధాంత్ చతుర్వేది - ఇషాన్ ఖట్టర్ లతో కూడిన సినిమా ఫస్ట్ లుక్ ఇప్ప‌టికే ప్రేక్షకులలో ఉత్సుకతను రేకెత్తించింది. చిత్ర‌బృందానికి సన్నిహితంగా ఉన్న ఒక సోర్స్ ప్ర‌కారం... ఈ సినిమాలో దెయ్యం పాత్ర బిగ్ స‌ర్ ప్రైజ్ నిస్తుంద‌ని చెబుతున్నారు.

టీనేజీ కుర్రాళ్ల‌ను వెంటాడే అంద‌మైన దెయ్యం పాత్ర‌లో క‌త్రిన క‌నిపిస్తుంద‌ట‌. ఫోన్ భూత్ నిస్సందేహంగా యూత్ లో  చర్చనీయాంశంగా మారే చిత్ర‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు. ప్రేక్ష‌కులకు కథ ..కంటెంట్ గురించి కొన్ని అంశాలు తెలిసినప్పటికీ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసే స‌ర్ ప్రైజ్ ఎలిమెంట్ ఈ సినిమాలో ఉంది. అది దెయ్యం పాత్ర అని చెబుతున్నారు.

కత్రినా కెరీర్ ఆద్యంతం గ్లామరస్ పాత్రల్లో యాక్ష‌న్ పాత్ర‌ల్లోనే చూసాం. మొదటిసారిగా దెయ్యం పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం దీపావళి సీజన్ లో విడుదల కానుంది. కత్రినా పెద్ద స్క్రీన్ పై ఇలాంటి విభిన్నమైన పాత్రను పోషించడం అభిమానుల‌ను ఉత్సాహ‌ప‌రిచే విష‌య‌మే. కత్రినా తనదైన అందం విలక్షణమైన ఆకర్షణతో దెయ్యం పాత్ర‌లో ఫ్యాన్స్ కి స్పెష‌ల్ ట్రీట్ ఇస్తుంద‌న‌డంలో సందేహం లేదు. క‌త్రిన‌ పెళ్లి తర్వాత చేస్తున్న మొదటి సినిమాగా ఫోన్ భూత్ రికార్డుల్లో ఉంది. బాలీవుడ్ వ‌రుస ఫ్లాపుల‌తో క్రైసిస్ లో ఉంది. ఇలాంటి స‌మ‌యంలో సీనియ‌ర్ న‌టి క‌త్రిన ఆదుకుంటుందేమో చూడ‌లి.

గుర్మీత్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  రవి శంకరన్ - జస్విందర్ సింగ్ బాత్ రచించారు. ఫోన్ భూత్‌ను రితేష్ సిధ్వానీ - ఫర్హాన్ అక్తర్ నేతృత్వంలోని ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మించింది. దీపావళి తర్వాత విడుదల కానున్న ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫోన్ బూత్ స్టార్లు ఇటీవల కరణ్ జోహార్ షో 'కాఫీ విత్ కరణ్ 7'కి హాజరయ్యారు. ప్రేక్షకులు వారి ఆఫ్ ద‌ స్క్రీన్ సంద‌డిని గొప్ప‌గా ఎంజాయ్ చేసారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News