ఫ్రెండ్స్ లిస్టులో స‌ల్మాన్‌ పేరు ఎక్కడ?

Update: 2015-11-12 05:25 GMT
హాట్ లేడీ క‌త్రిన కైఫ్ ఇటీవ‌లి కాలంలో గ్లామ‌ర్ కంటెంట్‌ ని మ‌రింత‌గా ఎక్స్‌ పోజ్ చేసేస్తోంది. ధూమ్‌ 3 - బ్యాంగ్  బ్యాంగ్ మూవీస్‌ లో క‌త్రిన క‌నిపించిన తీరు కుర్ర‌కారును ఓ రేంజులో హీటెక్కించింది. స‌ల్మాన్ ఖాన్ నుంచి విడిపోయిన త‌ర్వాత క‌త్రిన కెరీర్ యూట‌ర్న్ తీసుకుంది. ఈ అమ్మ‌డు ఖాన్‌ ల త్ర‌యంలో ప్ర‌తి ఒక్క‌రి స‌ర‌స‌న న‌టించింది. యంగ్ హీరోస్‌ తోనూ ఆడిపాడింది. ఇన్నేళ్ల కెరీర్‌ లో త‌న‌కి ప‌రిచ‌యం లేని స్టార్ లేనేలేడు. స్టార్ డైరెక్ట‌ర్స్‌ - ప్రొడ్యూస‌ర్స్‌ తో ఎంతో సాన్నిహిత్యం ఉంది. మ‌రి అలాంట‌ప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవ‌రు? అని ప్ర‌శ్నిస్తే ఏం సమాధానం చెప్పిందో తెలుసా?

12ఏళ్ల కెరీర్‌ లో ఎంద‌రో స్నేహితులు ఉన్నారు. క‌బీర్‌ఖాన్‌ - అత‌డి భార్య మినీ మాధుర్‌ - క‌బీర్ అసిస్టెంట్ క‌రిష్మా కోహ్లీ - ద‌ర్శ‌కులు అలీ అబ్బాస్ జాఫ‌ర్‌ - ఆయ‌న్ ముఖ‌ర్జీ - రేష్మ శెట్టి (క‌త్రిన మేనేజ‌ర్‌) - అల్విరా అగ్నిహోత్రి - క‌ర‌ణ్ జోహార్‌ - ఆదిత్య చోప్రా .. ఇంత మంది పేర్లు చెప్పింది. వీళ్ల‌లో ఆదిత్య చోప్రాతో మ‌రీ అంత చ‌నువుగా ఉండ‌లేను కానీ మిగ‌తావాళ్ల‌తో వీలుంటే సినిమాల‌కు కూడా క‌లిసే వెళ‌తాన‌ని చెప్పింది. మ‌రి చాంతాడంత లిస్టులో త‌న కెరీర్ ఆరంభ స్నేహితుడు స‌ల్మాన్‌ ఖాన్ పేరు  .. క‌నీస‌ మాత్రంగానైనా ప్ర‌స్థావించ‌లేదే.. ప్ర‌స్తుత ప్రియుడు - చెలికాడు - స్నేహితుడు ర‌ణ‌బీర్ క‌పూర్ పేరును ఎందుకు చెప్ప‌లేదు? ఏమో క‌త్రిన‌కు ఎందుకంత నామోషీ అంటూ బాలీవుడ్‌ లో ముచ్చ‌టించుకుంటున్నారంతా. ప్చ్‌.. టూ బ్యాడ్ క‌త్రిన‌.

Tags:    

Similar News