సల్మాన్‌ - కత్రీనా... పుకార్లు నిజమే

Update: 2019-05-05 07:56 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ తాజాగా 'భారత్‌' అనే చిత్రంలో నటించాడు. సల్మాన్‌ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో హీరోయిన్‌ గా కత్రీనా కైఫ్‌ నటించిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో మొదట హీరోయిన్‌ గా ప్రియాంక చోప్రాను ఎంపిక చేయడం జరిగింది. కాని ఏవో కారణాలు చెప్పి ఆమె సినిమా నుండి తప్పుకుంది. ఆ సమయంలో వెంటనే మరో హీరోయిన్‌ కావాల్సి రావడంతో కత్రీనా ఒప్పుకుంది. సినిమా ఎమాత్రం ఆగకుండా కత్రీనా వెంటనే  డేట్లు కూడా కేటాయించిందట. దాంతో కత్రీనాపై అభిమానంతో సల్మాన్‌ ఖాన్‌ ఆమెకు చాలా ఖరీదైన కారును బహుమానంగా ఇచ్చాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఆ పుకార్లపై ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్‌ అయితే లేదు, కాని తాజాగా కత్రీనా ఒక ఖరీదైన కొత్త కారుతో ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. తన కొత్త కారు అంటూ ఆమె పంచుకున్న ఫొటో గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లకు ఆజ్యం పోసినట్లయ్యింది. ఉన్నట్లుండి కత్రీనా కొత్త కారు అంటూ పోస్ట్‌ చేసిన నేపథ్యంలో అది ఖచ్చితంగా సల్మాన్‌ ఖాన్‌ ఇచ్చి ఉంటాడనే ప్రచారం మరింత జోరుగా బాలీవుడ్‌ లో జరుగుతుంది. ఇండస్ట్రీలో ఇలా గిప్ట్‌ లు ఇచ్చుకోవడం చాలా కామన్‌. అయితే వీరిద్దరు ఎందుకు ఈ విషయాన్ని దాస్తున్నారు అంటూ బాలీవుడ్‌ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు.

ఇటీవలే సల్మాన్‌ ఖాన్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చిత్రం కోసం కత్రీనా చాలా కష్టపడిందని ప్రశంసించాడు. సినిమా కథ నేపథ్యంలో ఈ చిత్రంలో కత్రీనా మూడు వయసుల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా వృద్దురాలి పాత్రలో కత్రీనా కనిపించబోతుందని తెలుస్తోంది. ఇంతగా కష్టపడింది కనుకే కత్రీనాకు సల్మాన్‌ గిఫ్ట్‌ ఇచ్చి ఉండవచ్చు.

Tags:    

Similar News