వీడియో: స‌్టార్ హీరోయిన్ జ‌ల‌కాలాట‌లు

Update: 2019-01-03 07:06 GMT
జ‌ల‌కాలాట‌ల‌లో ఏమి హాయిలా హ‌లా! అంటూ సాంగేసుకోవాల్సిందే ఈ బికినీ భామ‌ల‌ ప‌రాచికం చూస్తుంటే. కొత్త సంవ‌త్స‌రం వేళ కిక్కెక్కించే ట్రీట్ అంటూ ముగ్గురు ముద్దుగుమ్మ‌లు ఇలా బికినీల‌తో గ‌డ్డ క‌ట్టించే చ‌ల్ల‌ని నీళ్ల‌లోకి దిగిపోయి జ‌ల‌కాలాడారు. ఆ దృశ్యం చూసేందుకు చాలా విచిత్రంగానే ఉన్నా.. మైన‌స్ డిగ్రీ చ‌లిలో ఎందుకంత‌ ప‌ని  చేశారు? అంటే జ‌నాల‌కు సందేశం ఇవ్వ‌డానికేన‌ట‌. ఆ ముగ్గురిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రిన కైఫ్ కూడా ఉంది.

``హ్యాపీ ఫ‌స్ట్ న్యూ ఇయ‌ర్ డే.. జీరో డిగ్రీల చ‌లిలో ఇంగ్లీష్ చానెల్ నీళ్ల‌లోకి దిగేశాం. కొత్త సంవ‌త్స‌రం పాఠాలు ఇలా ఉన్నాయి. స‌ముద్రంలో మున‌గాలంటే వేసవి అయితేనే బెట‌ర్. ముఖ్యంగా స‌ముద్రంలో వ‌య‌సులో పెద్ద‌వాళ్లు మున‌గాలంటే వేస‌విలో మాత్ర‌మే సేఫ్. ఇత‌రుల్ని మీ ఇష్టానికి ముంచ‌కండి.. ఎందుకంటే వాళ్ల క‌ష్టాలు వాళ్ల‌కు ఉంటాయి. మేమంతా క‌లిసే ఇలా స‌ముద్రంలోకి దిగాం. మీ మైండ్ మీ శ‌రీరం కోరుకునేదేంటో తెలుసుకోవాలి. దానికి స‌హ‌క‌రించాలి అంతే!`` అంటూ చాలా పెద్ద క్లాస్ నే తీసుకుంది క‌త్రిన‌.

ఇంత‌కీ ఆ జిగ‌ట నేల‌లోంచి వెళ్లి నీళ్లలో మునిగిన ఆ ముగ్గురిలో ఒక‌రు క‌త్రిన అయితే, మిగ‌తా ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు ఎవ‌రు? అంటే త‌న‌కంటే ఏజ్‌లో ఎంతో పెద్ద‌వాళ్ల‌తో బికినీలు వేయించి ఇలా స‌ముద్రంలోకి దించింద‌ని అర్థ‌మ‌వుతోంది. అందుకే పెద్ద‌ల‌కు ప్ర‌త్యేకం! అంటూ ఇలా క్లాస్ తీస్కుంది క్యాట్. క్యాట్ జ‌ల‌కాలాట‌లు ప్ర‌స్తుతం నెటిజ‌నుల్లో హాట్ టాపిక్!

వీడియో కోసం క్లిక్ చేయండి


Tags:    

Similar News