కత్తి మహేష్ లేటెస్ట్ హెల్త్ అప్డేట్..!

Update: 2021-06-28 08:30 GMT
టాలీవుడ్ ప్రముఖ మూవీ క్రిటిక్ కత్తి మహేష్ ఇటీవలే ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతని ఆరోగ్యం గురించి సినీ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కంగారు పడుతున్నారు. ఎప్పటికప్పుడు అతని ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. కత్తి మహేష్ ఈ నెల 26న నెల్లూరులోని చెన్నై - కలకత్తా హైవే పై తెల్లవారి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రమైన గాయాలకు గురయ్యాడు. ముందుగా కత్తి మహేష్ ను నెల్లూరులోని మెడికవర్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే మహేష్ ఆరోగ్య పరిస్థితి మరింత సీరియస్ అయ్యేసరికి వెంటనే నెల్లూరు నుండి చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చెన్నైలో కత్తి మహేష్ కు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో మహేష్ తలకు ఘోరంగా గాయాలయ్యాయి.

 గాయపడిన మహేష్ రెండు కళ్లకు ఈరోజు శస్త్రచికిత్స చేయనున్నారు. ముఖానికి కూడా తీవ్రగాయాలు కావడంతో అతని రెండు కళ్ళలో ఎడమ కన్ను పూర్తిగా కంటిచూపు కోల్పోయినట్లు చెన్నై వైద్యబృందం తెలిపింది. కానీ తలలో ఎలాంటి రక్తస్రవం కాకపోవడంతో ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కత్తి మహేష్ కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. మహేష్ ముక్కుకు కూడా భారీ గాయాలు అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్ కు శంకర్ నేత్రాలయ వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అయితే ఆక్సిడెంట్ టైంలో మహేష్ తో పాటు డ్రైవర్ కూడా ఉన్నాడట. ఆ డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో సేఫ్ గా బయటపడినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మహేష్ కంటి ఆపరేషన్ గురించి అతని కుటుంబికులు ఎదురు చూస్తున్నట్లు సమాచారం.
Tags:    

Similar News