మనోజ్ కు సలహాలిస్తున్న కౌశల్ ఆర్మీ!

Update: 2018-09-27 16:52 GMT
బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ ఫాలోయర్స్ అయిన కౌశల్ ఆర్మీ బిగ్ బాస్ హోస్ట్ నాని అంటే మండిపడుతున్న విషయం తెలిసిందే.  ఇక ఎలాంటి అవకాశం వచ్చినా నానిని విమర్శించేందుకు వారు రెడీగా ఉంటున్నారు. అంతే కాదు..  నాని అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన తాజా చిత్రం 'దేవదాస్' ను చూడొద్దని కూడా చాలామంది డిసైడ్ అయ్యారంటే  నానిపై వారు ఏ రేంజ్ లో అప్ సెట్ అయ్యారన్నది మనం అర్థం చేసుకోవచ్చు. 

ఇలాంటి సమయంలో హీరో మంచు మనోజ్ 'దేవదాస్' విడుదల సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. "దేవ్ అండ్ దాస్ థ్రిల్లింగ్ కాంబో! ఈ ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడటం ఆనందంగా ఉంది. రోజు రోజుకు యంగ్‌ గా మారుతున్న నాగార్జున గారికి..  నాని బాబాయ్‌ కి .. దేవదాస్ టీమ్‌ అందరికీ బెస్ట్ విషెస్" అని ఒక ట్వీట్ చేశాడు. ఇక ఈ విషయం పై కౌశల్ ఆర్మీ మండి పడ్డారు. ఒకరు "ఏం థ్రిల్లింగ్ భయ్యా... మీరు ఈ కామెంట్స్ చేసి మా కౌశల్ అభిమానులను హర్ట్ చేశారు" అన్నారు.

దానికి రిప్లై ఇస్తూ "సినిమా అంటే ఒక్కరిది కాదు తమ్ముడూ. ఎంతో మంది ఆకలి కష్టం. ఎన్నో డిపార్టుమెంట్లు రాత్రి పగలు ఫ్యామిలీస్‌ ని వదిలి పని చేస్తారు. ఈ నెగెటివ్ థాట్స్ అన్నీ వదిలేయండి. అందమైన తెలుగు సినిమాను ఎంజాయ్ చేయండి. ప్రతి యాక్టర్.. టెక్నీషియన్‌ ను ప్రేమిద్దాం.. గౌరవిద్దాం" అన్నాడు. దీనికి ఒకరు "మనోజ్ గారు.. మాకు కూడా మనీ ఊరికే రావడం లేదండి.. కష్టపడితేనే వస్తుంది మీ అందరి సినిమాలు చూడటానికి. ఒకరి కష్టం గురించి ఆలోచించే వ్యక్తి వేరే వాళ్లని చులకనగా మాట్లాడరు. నాని గౌరవం కోల్పోయాడు" అంటే మరో కౌశల్ ఆర్మీ మెంబర్ "మనోజ్ భయ్యా... ఈ విషయంలో అనవసరంగా దూరొద్దు. ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. తారక్ అన్న ఫ్రెండుగా మీపై గౌరవం ఉంది. బిగ్ బాస్‌ లో నాని చేస్తుంది తప్పు. దానికి అతడు అనుభవించాలి. కౌశల్ ఆర్మీని లైట్ తీసుకుంటే అందరూ త్వరలోనే అనుభవిస్తారు" అన్నాడు.

మరో కౌశల్ ఆర్మీ మెంబర్ " ఏంది భయ్యా రోజూ నీ ప్రవచనాలు జనాలకు. మరీ హడావుడి చేస్తున్నావు. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనకండి. ఎవడి పని వాడు చేస్తున్నాడు. నీ పని నువ్వు చేసుకోవచ్చుగా. ప్రతి రోజూ పెద్ద సత్యసాయిబాబా లాగా జనాలకు క్లాస్ పీకడం ఎందుకు?" అన్నాడు. ఇక కౌశల్ ఆర్మీకి కౌంటర్ ఇచ్చేవారు కూడా ఉంటారుగా. ఒకరు "గొర్రెలు సినిమా చూడకపోతే ఏం కాదు.  మీరు గొర్రెలని మీరే ప్రూవ్ చేశారు. సినిమాకు గేమ్ షోకు లింక్ పెట్టడం ఎంట్రా బుర్ర లేకపోతే సరి. వాడొక నేతాజీ మీరు అయన ఆర్మీ" అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు.
Tags:    

Similar News