లెజెండరీ డైరెక్టర్ కీరవాణి జీవితంలో ఎన్నో మ్యూజికల్ హిట్లున్నాయి. అలాగే ఆయన సంగీత దర్శకుడిగా విఫలమైన సినిమాలూ లేకపోలేదు. ఆయన మంచి సంగీతాన్నందించి కూడా సినిమాలు ఆడని సందర్భాలూ ఉన్నాయి. ఐతే ఇవి తన పరాజయాలు కాదని అంటున్నాడు కీరవాణి. తన జీవితంలో అతి పెద్ద పరాజయం అంటే.. తాను బరువు తగ్గలేకపోవడమే అని ఆయన చెప్పడం విశేషం. ఒకప్పుడు తాను సన్నగానే ఉండేవాడినని.. ఐతే బాలు.. జానకి లాంటి లెజెండరీ సింగర్లను చూసి లావుగా ఉన్న వాళ్ల గొంతుకకే విలువ ఎక్కువ అని భ్రమ పడ్డానని.. అందుకే అడ్డదిడ్డంగా బరువు పెరిగిపోయానని కీరవాణి చెప్పాడు.
ఐతే లావు ఎన్ని రకాలుగా ఇబ్బందో తాను ఆలస్యంగా గ్రహించానని.. అప్పట్నుంచి ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేకపోతున్నానని.. ఇంతకుమించి పరాజయం తన జీవితంలో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి తనకు బీపీ.. షుగర్ లాంటి ఇబ్బందులేమీ లేవని.. ఎంత పని చేసినా ఒత్తిడిగా భావించనని.. తరచుగా హాస్య రస పుస్తకాలు చదవడం వల్ల ఒత్తిడిని అధిగమిస్తానని.. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలనుకుంటా కాబట్టి తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. కానీ బరువు తగ్గలేకపోవడం మాత్రం బాధ కలిగిస్తుందని.. మున్ముందు అయినా ఈ ప్రయత్నంలో విజయవంతం అవుతానేమో చూడాలని కీరవాణి అన్నారు.