రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహ వేడుకలు జైపూర్ లో జోరుగా సాగుతున్నాయన్న విషయం తెలిసిందే. రాజమౌళి కుటుంబ బంధువులు.. అమ్మాయి పూజా ప్రసాద్ తరఫు వారు.. టాలీవుడ్ సెలబ్రిటీలతో ఫెయిర్ మాంట్ హోటల్ కోలాహలంగా ఉంది. వివాహం అంటే ఇక విందు వినోదాలు.. సరదా కార్యక్రమాలు కూడా ఉంటాయి కదా. అలా కీరవాణి - ప్రభాస్ - ఎన్టీఆర్ ల మధ్య జరిగిన సరదా సంభాషణ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రెండున్నర నిముషం నిడివి ఉన్న ఈ క్లిప్ లో మొదట ప్రభాస్.. కీరవాణి ల మధ్య ఇలా సంభాషణ జరిగింది. ప్రభాస్ కు ఏదో జ్ఞానం బోధిస్తున్నట్టుగా కీరవాణి "ఆడవారి వయసు మగవాడి సంపాదన చెప్పకూడదు.. అందుకనే బాహుబలి లో నీ రెమ్యునరేషన్ కూడా చెప్పకూడదు" అన్నాడు. దీనికి సమాధానంగా ప్రభాస్ 'సరే సర్' అన్నాడు. ఇక మధ్యలో తారక్ ఎంట్రీ ఇచ్చి "మీరు బృందావనం లో చేశారు కదా అది లేదా" అంటూ వాదనకు దిగాడు. దీంతో మొదట "నేను బృందావనం చేయలేదు" అన్నాడు కీరవాణి. దానికి తారక్ సమాధానంగా ఒక 'వచ్చాడురా' పాట పాడుతూ మీరు ఆ పాడారు కదా అని గుర్తు చేశాడు. దీనికి ప్రభాస్ తో సహా అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. ఈ దెబ్బతో షాక్ అయిన కీరవాణి "తారక్.. ఎలిఫెంట్ మెమరీ ఇది" అన్నాడు. అప్పుడు తారక్ ప్రభాస్ కు షేక్ హ్యాండ్ ఇస్తూ "మనం గెలిచాం బ్రదర్" అన్నాడు
ఇక కీరవాణి ప్రభాస్ తో మళ్ళీ తన మాటలు కంటిన్యూ చేశాడు. "డార్లింగ్.. నా మొదటి సినిమా కల్కి. అప్పట్లో ఇంత రెమ్యునరేషన్ ఉండేది కాదు. మీ నాన్నగారు సూర్యనారాయణ రాజు గారు అప్పట్లో నాకు కొంత మొత్తం ఇస్తానని ప్రామిస్ ప్రామిస్ చేశారు. ఫిక్స్ చేశారు." అంటుండగా "మొత్తానికి ఇచ్చారు కదా సార్" అంటూ ఆన్సర్ ఇచ్చాడు. మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్కేయండి.