ఇప్పుడు కీరవాణి చేసిన గత కామెంట్లపైనే ఆల్రెడీ ఫిలిం ఇండస్ర్టీలో చాలామంది మండి పడుతుంటే.. ఆయన మరోసారి సంచలన కామెంట్లు చేశారు. మ్యాటర్ ఏంటంటే.. అసలు ఫిలిం ఇండస్ర్టీలో తాను బ్రెయిన్ లైస్ డైరక్టర్లతో పనిచేశానని కీరవాణి చెప్పడంతో.. గొప్ప గొప్ప దర్శకులతో పనిచేసిన ఈ కంపోజర్ అలా అనడం తగదని సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తన వాణి వినిపించారు.
''దాసరి.. రాఘవేంద్రరావు.. విశ్వనాథ్.. మహేష్ భట్ వంటి దర్శకులకు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన కీరవాణి.. నేషనల్ అండ్ స్టేట్ అవార్డులు అందుకున్న కీరవాణి.. తనకు కథ నచ్చినప్పుడు మాత్రమే సినిమాలు చేసిన కీరవాణి.. అటువంటి స్టేట్మెంట్ ఎందుకిచ్చారో తెలియట్లేదు. కీరవాణి అలా అనడం కరక్ట్ కాదు. ఆయన అభిమానిగా నేను హర్టయ్యాను'' అంటూ చెప్పారు తమ్మారెడ్డి. అయినాకూడా ఒక మిత్రుడిగా కీరవాణి తన స్టేట్మెంట్లను వెనక్కి తీసుకోవాలని తమ్మారెడ్డి సూచించారు.
దీనిపై స్పందించిన కీరవాణి.. ట్విట్టర్ ద్వారా మరిన్ని కౌంటర్లు వేశారంతే. ''సడన్ గా ఇప్పుడే రియలైజ్ అయ్యాను. నాతో పనిచేసిన దర్శకులు అందరూ జీనియస్లే. నేను మాత్రమే బ్రెయిన్ లెస్ ఫెలోని. నేను తప్ప అందరూ చాలా ఒదిగి ఉంటారు. యారొగెన్స్ అంటే అర్ధం నా పేరేనని ఇప్పుడే డిక్షనరీలో చూసుకున్నాను. ఐదు నిమిషాల్లో తమ్మారెడ్డి గారు నా బ్రెయిన్ లెస్ బ్రెయిన్ ను కడిగేశారు'' అంటూ ట్వీటేసి హేళన చేశారు కీరవాణి.
28వ తారీఖున సినిమా రిలీజ్ చేయాలి కాబట్టి.. నేను పనిచేయాలి కాబట్టి.. రాజమౌళి తిడతాడు కాబట్టి.. ప్రొడ్యూసర్లు తిడతారు కాబట్టి.. నాకు పనుంది కాబట్టి.. ఇక సెలవు అంటూ పంచ్ లతో తన ట్వీటాస్ర్తాలను ముగించారు ఈ సీనియర్ కంపోజర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/