టాలీవుడ్ లో బాహుబలి తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ 'సైరా' సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడంతో నిర్మాత రామ్ చరణ్ దర్శకుడు సురేందర్ రెడ్డి భారీ తారాగణాన్నే సెట్ చేశారు. ఇక టెక్నీషియన్ల గురించి చెప్పనక్కర్లేదు. అయితే సినిమాకు మొదట సెట్ అయిన ప్రముఖ టెక్నీషియన్స్ సినిమా స్టార్ట్ కాకముందే కొన్ని కారణాల వల్ల తప్పుకున్న విషయం కూడా అందరికీ తెలిసిందే.
ఇక వారి ప్లేస్ లో మరొకరిని సెట్ చేసుకోక తప్పడం లేదు. ఇటీవల సంగీత దర్శకుడు ఎఆర్.రెహమాన్ సైరా నుంచి తప్పుకోగా మొదట దర్శకుడుపై కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇక రెహమాన్ మాత్రం తన బిజీ షెడ్యూల్ వల్ల వర్క్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం అలాంటి పెద్ద టెక్నీషియన్ తప్పుకున్నాడు కాబట్టి మళ్లీ ఆ స్థాయిలో ఉండే టెక్నీషియన్ ని తీసుకురావాలి. అయితే ఇప్పుడు సైరా టీమ్ కి టాలీవుడ్లో ఒకే ఒక్క సంగీత దర్శకుడు కనిపిస్తున్నాడు అని తెలుస్తోంది. ఆయనే కీరవాణి. ఎటువంటి కథాంశంతో సినిమా ఉన్నా తన మ్యూజిక్ తో వీలైనంత వరకు మూవీ కి ప్రాణం పొసే కీరవాణి దర్శకుడి ఆలోచనను బట్టి వర్క్ చేస్తుంటాడు.
ఆయనను కరెక్ట్ గా వాడుకుంటే సినిమా స్థాయిని పెంచేలా మ్యూజిక్ ఇవ్వగలడు. అందుకే చిత్ర యూనిట్ లో సగం మంది కీరవాణికే ఓటేశరని తెలుస్తోంది. ఇక నిర్మాత దర్శకుడు ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే తెలుగులో అలాంటి హిస్టారికల్ మూవీకి సెట్ అయ్యే టెక్నీషియన్ ఎవరూ లేరనే చెప్పాలి. ఒకవేళ ఎవరన్నా ఉన్నా.. ఎలాంటి అవుట్ పుట్ వస్తుందో చెప్పడం కష్టం. ఇప్పుడు ఆప్షన్స్ వెతుక్కుంటే ఇక బాలీవుడ్ లో సెర్చ్ చేయక తప్పదేమో. ఆ లెక్కన కీరవాణి చేతికే సైరా పగ్గాలు ఇవ్వడం బెస్ట్. లెటజ్ సీ.