తమ ఫ్యామిలీలో రెండో తరం తమ తరం వాళ్లందరం ప్రతిభావంతులుగా తయారయ్యామంటే అది తన చిన్నాన్న విజయేంద్ర ప్రసాద్ వల్లే అంటున్నాడు కీరవాణి. ఆయన చిన్నతనం నుంచి తమనకు తనదైన శైలిలో తీర్చిదిద్దాడని కీరవాణి చెప్పాడు. తన తమ్ముడు ఎస్.ఎస్.కాంచి దర్శకుడిగా మారి ‘షో టైం’ లాంటి విభిన్నమైన సినిమాను తీయడంలో తమ చిన్నాన్న స్ఫూర్తిగా కూడా ఉందంటూ ఆసక్తికర విషయాలు చెప్పాడు కీరవాణి.
‘‘మా ఇంట్లో అందరం చెస్ ఆడేవాళ్లం. మాకు విజయేంద్ర ప్రసాద్ గారే ఈ ఆట నేర్పించేవాళ్లు. ఆయన ఆట ఆడించే తీరు విభిన్నంగా ఉండేది. ముందు మా వైపు ఏనుగుల్ని తీయించేసి ఆడమనేవాళ్లు. ఆ తర్వాత మంత్రిని తీయించేసి ఆడమనేవాళ్లు. అది ఒకరకంగా కాళ్లు చేతులు తీసేసి యుద్ధం చేయమనడమే. అప్పటికి ఆయన శాడిస్టిగ్గా అనిపించినా.. అలా ఆడటం వల్ల మేం మరింత దృఢంగా తయారయ్యాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా పోరాడటం నేర్చుకున్నాం. నా తమ్ముడు కాంచి దర్శకుడిగా సినిమా తీయాలనుకున్నపుడు నేను ఇదే శైలిని అనుసరించా. అతడికి కొన్ని కండిషన్లు పెట్టా. ఇందులో ఐటెం సాంగ్ ఉండకూడదు. ఫైట్లు ఉండకూడదు. పెద్దగా కామెడీ ఉండకూడదు. ఇలా కండిషన్లు పెట్టి కథ రాయమన్నాను. అతను ‘షో టైం’ కథ రాసుకుని వచ్చాడు. ఇలా చేయడం వల్ల ఒక వైవిధ్యమైన సినిమా తయారైంది. ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని అనుకుంటున్నా’’ అని కీరవాణి తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/