బాలీవుడ్ బిగ్ ఆఫర్ వదులుకున్న స్టార్ హీరోయిన్

Update: 2020-05-09 00:30 GMT
టాలీవుడ్ 'మహానటి’ సినిమాతో జాతీయ అవార్డు అందుకుని టాప్ హీరోయిన్ గా పాపులర్ అయిపోయింది కీర్తి సురేష్. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అలనాటి నటి సావిత్రమ్మ బయోపిక్‌లో నటించే అవకాశం ఆమెను వరించింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది కాబట్టే ఈరోజు ఆమెను అందరూ ‘సావిత్రమ్మ’గానే గుర్తుపెట్టుకున్నారు. మహానటి తర్వాత ఆమెకు అవకాశాలు అన్ని ఇండస్ట్రీల నుంచి వచ్చి పడుతున్నాయి. బాలీవుడ్ నుంచి కూడా పిలుపు వచ్చిందంటే కీర్తికి ఎంతటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్‌లో తొలి సినిమాలోనే అజయ్ దేవగణ్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశం వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘మైదాన్’ అనే క్రీడా నేపథ్యంలో తెరకెక్కే సినిమా రాబోతోందని వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమా నుంచి కీర్తి తప్పుకున్నారని బాలీవుడ్ తెలిపాయి.

ఈ విషయం గురించి నిర్మాత బోనీ కపూర్‌ కూడా అప్పట్లో వెల్లడించారు. దీనికి కారణం.. కీర్తి చూడటానికి చాలా యంగ్‌గా కనిపిస్తున్నారట. ఎందుకంటే ఆ సినిమాలో కీర్తి అజయ్ భార్య పాత్రలో నటించాల్సి ఉంది. కానీ కీర్తి ఆయన పక్కన చిన్న పిల్లలా కనిపిస్తున్నారట. కనీసం వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్స్‌తోనూ ఆమె లుక్‌ను మార్చలేని పరిస్థితి. అదీకాకుండా ‘మహానటి’ సినిమాలో 27 ఏళ్ల కీర్తి 45 ఏళ్ల సావిత్రి పాత్రలో నటించారు. ఆ తర్వాతి సినిమాలో కూడా పెద్ద వయసున్న మహిళ పాత్రలో నటిస్తే కీర్తికి ఇలాంటి పాత్రలే వస్తాయని అనుకునే ప్రమాదం కూడా ఉందని బోనీ అభిప్రాయపడ్డారట. అందులోనూ కీర్తి నటిస్తున్న తొలి హిందీ సినిమా ఇదే. ఆరంభంలోనే ఇలాంటి సమస్యలు ఎదురైతే మున్ముందు కెరీర్ దెబ్బతినే అవకాశం ఉందని కీర్తి వదులుకుందట. ఇక తాజాగా కీర్తికి బిగ్ బడ్జెట్ మూవీలలో గ్లామర్ రోల్స్ వస్తున్నాయట. ఇంతవరకు గ్లామర్ రోల్ చేయని కీర్తి ఈ కొత్త ఆఫర్స్ కూడా రిజెక్ట్ చేసిందట.
Tags:    

Similar News