మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. మలయాళ నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె అయిన కీర్తి.. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసింది. `గీతాంజలి` అనే మలయాళ చిత్రంతో హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభించింది. ఇటు టాలీవుడ్ లోకి కీర్తి సురేష్ `నేను శైలజ`తో ఎంట్రీ ఇచ్చింది. 2016లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించడమే కాదు.. కీర్తి సురేష్ కు యూత్ లో సూపర్ క్రేజ్ ను తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. `మహానటి` చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అలాగే టాలీవుడ్ లో ఆగ్రహీరోయిన్ గానూ ముద్ర వేయించుకుంది. మహానటి అనంతరం కీర్తి సురేష్ కెరీర్ కాస్త డల్ అయినా.. మళ్లీ `సర్కారు వారి పాట`తో సక్సెస్ ట్రాక్ ఎక్కింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, పరశురామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ మొదట మిశ్రమ స్పందనను దక్కించుకున్నా.. ఆ తర్వాత అదిరిపోయే కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ లో కళావతిగా కీర్తి ప్రేక్షకులను మిస్మరైజ్ చేసింది. అలాగే ఈ సినిమాకు కొద్ది రోజుల ముందు వచ్చిన `సాని కాయిదం(తెలుగులో చిన్ని)`లోనూ ఆమె బాగానే అలరించింది. ఈ మూవీలో కీర్తి మున్నెప్పుడూ చేయని వైవిధ్యమైన పాత్రను పోషించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళంలోనూ నటిస్తున్న కీర్తి సురేష్.. తన సినిమాలను ఎప్పుడూ చూసుకోదట. అవును, మీరు విన్నది నిజమే. ఈ విషయం ఆమెనే స్వయంగా తెలిపింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. `నా సినిమాలు నేను చూసుకోను. అలా చూస్తే నా నటనలోనే చాలా లోపాలు కనిపిస్తాయి.
ఇంకా బాగా నటించాల్సింది కదా అనుకుంటూ మనసును పాడుచేసుకుంటా. అందుకే నా సినిమాలు చూడాలంటే కాస్త భయం వేస్తుంది. ఫ్రీ టైమ్ దొరికితే ఫ్యామిలీతో కలిసి కేరళ వెళ్తుంటాను. నా పెట్ డాగ్ నైకీతో ఆడుకుంటా` అని చెప్పుకొచ్చింది.
అలాగే కెరీర్ గురించి మాట్లాడుతూ.. తనకు వైవిధ్యమైన పాత్రలతో పాటు కమర్షియల్ చిత్రాల్లోనూ నటించడమంటే ఎంతో ఆసక్తి అని కీర్తి పేర్కొంది. కాగా, తెలుగులో ఈమె నాని సరసన `దసరా`, మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా `భోళా శంకర్` చిత్రాలు చేస్తోంది. ఇక తమిళంలో `మామన్నన్`, మలయాళంలో `వాశి`తో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం ఆమె చేతిలో ఉన్నాయి.