మలయాళీ బ్యూటీ కీర్తి సురేష్ ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేగలదని `మహానటి` చిత్రం నిరూపించింది. గ్లామర్ రోల్స్ తో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లోనూ కీర్తి రాణించింది. క్లాసిక్ నటి సావిత్రి పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులు .. విమర్శకుల నీరాజనాలు అందుకుంది. సావిత్రి పాత్రలో మరో ఆప్షన్ అన్నదే లేదని ప్రూవ్ చేసింది. ఆహార్యం సహా అచ్చు గుద్దినట్లే మెప్పించింది. ఇక ఆ పాత్ర కోసం కీర్తి ఎంతగా శ్రమించిందో చెప్పాల్సిన పనిలేదు. స్టార్ కాకముందు సావిత్రి ఎలా ఉండేవారు? నటి అయిన తర్వాత శరీరం మార్పులు సహా ప్రతీ సన్నివేశంలోనూ కీర్తి సావిత్రిని గుర్తు చేసింది. ఆ ఇక్క పాత్ర కీర్తిని అగ్ర స్థానంలో నిలబెట్టింది. బెస్ట్ పెర్పామర్ గా అవార్డులు..రివార్డులు అందుకుంది.
తాజాగా కీర్తి సురేష్ మరోసారి వెండి తెరపై తనదైన మార్క్ చూపించడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో `మరక్కర్ అరబిందలింటే సింహామ్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి మలయాళ కుట్టీగా కనిపించనుంది. తాజాగా ఆ పాత్రకు సంబంధించిన లుక్ రిలీజ్ అయింది. లుక్ పరంగా కీర్తి గురించి చెప్పేదేం ఉంది. బేసిక్ గా మలయాళీ అమ్మాయి కాబట్టి అక్కడి సంస్కృతి సంప్రదాయాన్ని పుక్కిట పట్టింది కీర్తి.
తాజా లుక్ లో మలయాళం ట్రెడిషన్ కట్టు బొట్టుతో మైమరిపించింది. ఒక రకంగా మోడ్రన్ బిజిలీనే తలపించిందని చెప్పొచ్చు. కాస్త ఆదివాసీ తరహా స్టైల్ ని బిల్డ్ చేసిన లేటెస్ట్ ట్రెడిషనల్ వేర్ తో మైమరిపించింది. వంగ పువ్వు రంగు జాకెట్...తెలుపు చీర జరీ అంచు పైట కొంగు.. ఆ హెయిర్ స్టైల్.. ముకుపుడక దేనికదే సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తున్నాయి. చెవులకు దిద్దులు..ముక్కెర..మెడలో బంగారు ఆభరాణాలు.. రెండు చేతులకు గాజులు.. మలయాళీ కల్చర్ తో ఆ ఆహార్యంలో కొత్త లుక్ ఆకట్టుకుంది. చివరిగా ఈ అమ్మడి హెయిర్ స్టైల్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎడమ వైపు హెయిర్ మొత్తం కుడివైపు మళ్లించి ట్రిమ్ చేసిన ఓ కొత్త గెటప్ లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. మహానటి పాత్ర కోసం ఫిజికల్ గా శరీరంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో? ఇప్పుడు అచ్చమైన మలయాళీ అమ్మాయి పాత్ర కోసం సంప్రదాయ అలంకరణ తో ఒదిగి పోయిదంటూ ప్రశంసలందుకుంటోంది.