చెన్నై సుందరి అయినా మలయాళ సినిమాల నుంచి మన దగ్గరకు దిగుమతి అయిన భామ కీర్తి సురేష్. తెలుగులో ఇప్పటివరకూ ఈ భామ నటించిన సినిమాలు రెండు రిలీజ్ అయితే.. ఒకటి హిట్.. రెండోది బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు అజ్ఞాతవాసి అంటూ పవర్ స్టార్ తో కలిసి మెరిపించేదుకు సిద్ధమైన కీర్తి సురేష్.. మరోవైపు సావిత్రి బయోపిక్ గా రూపొందుతున్న మహానటి మూవీలో యాక్ట్ చేస్తోంది.
మహానటిలో సమంత కూడా యాక్ట్ చేస్తున్నా.. సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ను తీసుకోవడం విశేషం. ఇందుకు ఆమె రూపం కూడా సహకరించిందని చెప్పవచ్చు. నిజానికి సావిత్రి పాత్ర కోసం ఇంకొంచెం బరువు పెరగాలని అడిగాడట దర్శకుడు నాగ్ అశ్విన్. కానీ అప్పటికే ఆమె రూపంపై ఉన్న కొన్ని విమర్శల కారణంగా.. బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తున్న కీర్తి సురేష్.. దర్శకుడు అడిగిన మాటకు నిర్ద్వంద్వంగా నో చెప్పేసిందిట. సావిత్రి పాత్రలో నటించేందుకు సిద్ధమే అయినా.. బరువు పెరగడం కుదరదని ససేమిరా తేల్చేసిందట.
దీంతో ఆమె ఆహార్యం ద్వారా సావిత్రిగా చూపించాలని నిర్ణయించుకున్నాడట దర్శకుడు. అయితే.. ఇలా ఓ క్యారెక్టర్ కోసం బరువు పెరిగి.. ఆ తర్వాత తగ్గేందుకు తంటాలు పడుతున్న అనుష్క పరిస్థితిని చూసి.. కీర్తి సురేష్ ఇలాంటి నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. టాప్ హీరోయిన్ అనే ట్యాగ్ ఉన్నా.. గ్లామర్ పాత్రలు చేయలేని పరిస్థితిలో ఉన్న అనుష్క శెట్టి సిట్యుయేషన్.. కీర్తిని ఈ నిర్ణయం వైపు ప్రోత్సహించిందని టాక్.