కోలీవుడ్, టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కీర్తి సురేశ్. మహానటి చిత్రంలో కీర్తి నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకులూ ఫిదా అయ్యారు. స్టార్ హీరోల సరసన కీర్తిని పెట్టి సినిమా తీసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. మరోవైపు, కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న తమిళ హీరో శింబు...మణిరత్నంతో ఓ సినిమా చేస్తున్నాడు. నిర్మాతల మండలితో వివాదం....ఓ చిత్ర నిర్మాతతో గొడవ వంటి వ్యవహారాలు సెటిల్ చేసుకుని...రెండు,మూడు సినిమాలు సైన్ చేశాడని. టాక్. ఈ నేపథ్యంలో క్రేజీ హీరోయిన్ కీర్తి....సంచలన నటుడు శింబుతో కలిసి నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో ఓ సినిమా తీసేందుకు దర్శకుడు వెంకట్ ప్రభు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మహానటి హిట్ తర్వాత కీర్తి సురేశ్ కు తెలుగు, తమిళం భాషల్లో చాలా అవకాశాలు వస్తున్నాయి. అయితే, వాటిలో ఏ ప్రాజెక్టుకు ఆమె ఓకే చెప్పలేదట. ప్రస్తుతం విజయ్ సరసన సర్కార్, విశాల్ తో సండైక్కోళి 2, విక్రమ్ సరసన సామి స్క్వేర్ చిత్రాలలో కీర్తి నటిస్తోంది. అవి పూర్తయిన తర్వాతే కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తానని కీర్తి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ నేపథ్యంలోనే సురేశ్ కామాక్షి నిర్మాతగా శింబు - కీర్తి ల కాంబోలో వెంకట్ ప్రభు ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని టాక్ వస్తోంది. ఏఆర్.రెహ్మాన్ - పీసీ.శ్రీరామ్ లు పని చేస్తోన్న ఈ సినిమాకు కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. ఆల్రెడీ ఈ సినిమాకు `అదిరడి` అనే టైటిల్ కూడా ఫిక్సయిందట. అయితే, ఈ సినిమా గురించి కీర్తి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను దర్శకనిర్మాతలు త్వరలో వెల్లడించనున్నారు.