పండుగపూట పోలీసుల ముందుకు హీరోయిన్

Update: 2018-01-10 13:17 GMT
ఇప్పుడు జనాలంతా సంక్రాంతి పండుగ సందడిలో పడిపోయారు. కానీ ఇలాంటి పరిస్థితిలో ఓ హీరోయిన్ మాత్రం పోలీసుల దగ్గరకు వెళ్లని పరిస్థితిలో పడిపోయింది. వేడుకల సంగతేమో కానీ.. ఇప్పుడు పోలీసులు.. కోర్టులు అంటూ అవస్థలు పడుతోంది ఆ భామ.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనే కదా మీ డౌట్! తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లో కూడా తెగ నటించేసిన మలయాళీ భామ అమలా పాల్ కు.. ఇప్పుడు కోర్టు చిక్కులు ఎదురయ్యాయి. తన నివాసం కేరళ అయినా.. కారు రిజిస్ట్రేషన్ కోసం తప్పుడు ధృవీకరణ పత్రాలతో.. పాండిచ్చేరి వాసిగా చూపించిన కేసు.. అమలాపాల్ కు చుట్టుకుంది. ఈమెతో పాటు ఫదా ఫాజిల్ కు కూడా ఈ సమస్య ఎదురైంది. తక్కువ పన్ను చెల్లించేందుకు గాను.. ఇలా తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి.. దొంగ అడ్రస్ ప్రూఫ్ లు సృష్టించడం.. వాటిపై అధికారులు దర్యాప్తు చేసి.. కేసు నమోదు చేయడం వరుసగా జరిగిపోయాయి.

అయితే.. ఈ కేసు తీవ్రతరం అవుతుండడంతో.. ముందస్తుగా యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేశాడు ఫదా ఫాజిల్. ఇదే బెయిల్ కోసం కేరళ కోర్టులో అమలా పాల్ కూడా అప్లై చేసుకోగా.. కేరళ హైకోర్టు నుంచి షాక్ ఎదురైంది. ముందుగా కేరళ క్రైం బ్రాంచ్ అధికారుల వద్ద విచారణకు అమలాపాల్ హాజరు కావాలని చెప్పిన కేరళ హైకోర్టు.. జనవరి 15వతేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట లోపు అటెండ్ కావాలని చెప్పింది. దీంతో పండుగపూట విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అమలాపాల్ కు ఎదురైంది.


Tags:    

Similar News