ఆ హీరోకి బెయిల్ ఇవ్వ‌లేదు

Update: 2017-07-24 09:30 GMT
ప్ర‌ముఖ హీరోకి మ‌రోసారి చుక్కెదురైంది. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన మ‌ల‌యాళ న‌టి లైంగిక దాడి కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన మ‌ల‌యాళ ప్ర‌ముఖ న‌టుడు దిలీప్‌ కు మ‌రోసారి నిరాశే ఎదురైంది. ఆయ‌న దాఖ‌లు చేసుకున్న బెయిల్ పిటీష‌న్ ను కేర‌ళ హైకోర్టు తిర‌స్క‌రించింది.

ప‌లు భాషా చిత్రాల్లో సుప‌రిచితురాలైన న‌టి కిడ్నాప్‌.. ఆపై లైంగిక‌వేధింపుల‌కు గురి చేసిన ఉదంతంలో హీరో దిలీప్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. అత్యంత నాట‌కీయ ప‌రిణామాల్లో ఆయ‌న్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. పోలీసుల ప్రాధ‌మిక విచార‌ణ అనంత‌రం త‌న‌కు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ దిలీప్ కోర్టులో బెయిల్‌ పిటీష‌న్ దాఖ‌లు చేశారు.

కేసు తీవ్ర‌త దృష్ట్యా బెయిల్ ఇచ్చేందుకు అప్ప‌ట్లో న్యాయ‌స్థానం తిరస్కరించింది. తాజాగా ఆయ‌న మ‌రోసారి కేర‌ళ  హైకోర్టు దృష్టికి త‌న బెయిల్ పిటీష‌న్‌ ను తీసుకొచ్చారు. అయితే.. ఈ పిటీష‌న్‌ ను విచార‌ణ‌కు తిర‌స్క‌రిస్తూ కోర్టు నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం జైల్లో ఉన్న దిలీప్ జ్యూడిషియ‌ల్ క‌స్ట‌డీ ఈ నెల 15 వ‌ర‌కూ కొన‌సాగ‌నుంది.
Tags:    

Similar News