చిన్న సినిమా.. 10 రోజుల్లో 18.5 కోట్లు

Update: 2017-05-29 10:48 GMT
ప్లాన్ ప్రకారం తక్కువ బడ్జెట్లో సినిమా తీసి.. దాన్ని సరిగ్గా ప్రమోట్ చేస్తే.. ఓ మోస్తరు సినిమా అయినా ఎంత మంచి ఫలితాన్నిస్తుందో చెప్పడానికి ‘కేశవ’ రుజువుగా నిలుస్తోంది. ఇది గొప్ప సినిమా ఏమీ కాదు. కంటెంట్ పరంగా చూస్తే ఏవరేజ్ అనిపిస్తుంది. ఎన్నోసార్లు చూసిన రివెంజ్ స్టోరీనే స్టైలిష్ టేకింగ్ తో.. ఇంట్రెస్టింగ్ నరేషన్ తో చెప్పాడు దర్శకుడు సుధీర్ వర్మ. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్లో సినిమా తీసి కూడా మంచి క్వాలిటీ చూపించాడతను. క్రియేటివ్ గా.. ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేలా సినిమాను ప్రమోట్ చేయడం కలిసొచ్చింది. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో వారాంతంలోనూ సినిమా స్టడీగా వసూళ్లు రాబట్టింది. దీంతో నిర్మాత.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు.. ఇలా అందరూ సంతోషంగా ఉన్నారిప్పుడు.

పది రోజుల్లో ‘కేశవ’ ప్రపంచ వ్యాప్తంగా రూ.18.5 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. షేర్ రూ.10 కోట్ల దాకా వచ్చిందంటున్నారు. అంటే పెట్టుబడి మీద రెట్టింపు ఆదాయం వచ్చిందన్నమాట. దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ బయ్యర్లు లాభాల్లోకి వచ్చారు. కొన్ని ఏరియాల్లో నిర్మాత అభిషేక్ సొంతంగా రిలీజ్ చేసుకుని.. లాభాల్ని మరింత పెంచుకున్నాడు. నిర్మాతగా తొలి అడుగులు వేస్తున్న అభిషేక్ కు ‘కేశవ’ అన్ని రకాలుగా ఆనందాన్నిచ్చింది. ‘బాబు బాగా బిజీ’ సంగతి వదిలేస్తే.. ‘కేశవ’లో మంచి ప్రొడక్షన్ వాల్యూస్ చూపించాడని పేరొచ్చింది. మంచి లాభాలు కూడా అందుకోవడంతో నిర్మాతగా మరింత జోరు పెంచాలని చూస్తున్నాడు అభిషేక్. సుధీర్ తో ఆయన మరో సినిమా చేయడానికి కూడా ఆసక్తిగా ఉన్నాడట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News