‘కేశవ’ను మరీ అంత కత్తిరించేశారా..

Update: 2017-05-17 05:39 GMT
‘బాహుబలి: ది కంక్లూజన్’ రిలీజయ్యాక గత రెండు వారాల్లో విడుదలైన కొత్త సినిమాలేవీ అంతగా ఆకట్టుకోలేదు. ‘బాహుబలి-2’ విడుదలైన వారానికే రిలీజైన ‘బాబు బాగా బిజీ’ వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు. ఇక గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాలకూ రెస్పాన్స్ అంతంతమాత్రంగానే ఉంది. మంచి అంచనాల మధ్య విడుదలైన ‘రాధ’.. ఆ అంచనాల్ని అందుకోలేకపోయింది. ‘వెంకటాపురం’ సోసోగా అనిపించింది. ‘రక్షక భటుడు’ అడ్రస్ లేకుండా పోయింది. ఇక ఇప్పుడు ప్రేక్షకుల దృష్టంతా ‘కేశవ’ మీదికి మళ్లింది. ఈ శుక్రవారం పోటీయే లేకుండా సోలోగా థియేటర్లలోకి దిగుతోంది ‘కేశవ’.

‘బాహుబలి: ది కంక్లూజన్’ తర్వాత యువ ప్రేక్షకుల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న సినిమా ఇదే అని చెప్పాలి. ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ రూపొందించిన ఈ చిత్రంలో మొదట్నుంచి ఒక ఇంటెన్సిటీ కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లు.. టీజర్.. ట్రైలర్.. అన్నీ కూడా ఇంటెన్స్ గా కనిపించాయి. సుధీర్ ఎంతో కసిగా ఈ సినిమా తీశాడని ప్రోమోల్ని బట్టి తెలుస్తోంది. ఈ చిత్రానికి సెన్సార్ కూడా పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ‘కేశవ’ నిడివి 2 గంటలు కూడా లేకపోవడం గమనార్హం. 116 నిమిషాలతో ఫైనల్ కట్ రెడీ చేశారు. ఈ మధ్య సినిమాల నిడివి బాగా తగ్గించేస్తున్న మాట వాస్తవమే కానీ.. మరీ 2 గంటల నిడివి కూడా లేకపోవడం కొంత ఆశ్చర్యమే. ఐతే థ్రిల్లర్ లక్షణాలున్న సినిమాలకు నిడివి ఎంత తక్కువుంటే ప్రేక్షకులు అంత బాగా కనెక్టవుతారని సుధీర్ భావించి.. సినిమాను క్రిస్ప్ గా తయారు చేసినట్లు తెలిసింది. మరి సుధీర్-నిఖిల్.. ‘స్వామి రారా’ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News