లక్ష్మీపార్వతి దేవత అంటే సినిమా ఆపేస్తా

Update: 2017-11-04 09:58 GMT
నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ జీవిత కథతో సినిమా చేయబోతుంటే.. పోటీగా రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితంలోని మరో కోణాన్ని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చూపిస్తానంటూ రేసులోకి దిగాడు. ఇంతలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దీనికి పోటీగా ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అంటూ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్.. పోస్టర్ చూస్తేనే ఇది లక్ష్మీపార్వతిని లక్ష్యంగా చేసుకుని.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు యాంటీగా తీయబోతున్న సినిమా అని అర్థమైపోయింది. ఐతే తన అనుమతి లేకుండా ఈ సినిమా తీస్తే కోర్టుకు వెళ్తానంటూ లక్ష్మీపార్వతి హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఐతే ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. తాను ఈ సినిమాను ఆపేది లేదని అంటున్నాడు జగదీశ్వర్ రెడ్డి.

‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాకు సంబంధించి తాను ఓపెన్ డిబేట్ కు రెడీ అని సవాలు విసిరాడు జగదీశ్వర్ రెడ్డి. ఈ చర్చకు ఎంతమంది అయినా రావచ్చని.. వచ్చిన వాళ్లలో పది శాతం మంది లక్ష్మీపార్వతి దేవత అని అన్నా.. తాను ఈ సినిమా తీయకుండా ఆపేస్తానని ఆయన అన్నారు. ఈ సినిమా తీయొద్దంటూ తనకు బెదిరింపులు వస్తున్నట్లు ఆయన చెప్పారు. కానీ తాను ముందు చెప్పినట్లే వచ్చే ఏడాది నవంబరు 12న ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ విడుదలవుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ సినిమా తీసేందుకు అవసరమైన ఇన్ పుట్స్ కోసం జగదీశ్వర్ రెడ్డి తన బృందంతో కలిసి గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. లక్ష్మీపార్వతి మాజీ భర్త వీరగంధం వెంకట సుబ్బారావు సొంత ఊరు వినుకొండకు కూడా వెళ్లి ఆయన వివరాలు సేకరించనున్నారు. అలాగే లక్ష్మీపార్వతి సొంత ఊరికి కూడా ఆయన వెళ్తారట.
Tags:    

Similar News