కన్నడ సినిమా 'కేజీఎఫ్: చాప్టర్ 2' ఫస్ట్ వీక్ లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకుంది. హీరో యష్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన ఈ సినిమా.. అందరూ ఊహించిన విధంగానే హిందీ సర్క్యూట్ లో మంచి వసూళ్లను సాదిస్తోంది. ఈ నేపథ్యంలో నార్త్ లో 'KGF 2' చిత్రం 'బాహుబలి 2' రికార్డులను అధిగమిస్తుందా అనే చర్చ జరుగుతోంది.
'కేజీయఫ్ 2' సినిమా హిందీలో అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టింది. సక్సెస్ ఫుల్ గా రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం.. తొమ్మిది రోజుల్లో రూ. 280.19 కోట్ల కలెక్షన్స్ తో సంచనలం సృష్టించింది. ఇప్పటి వరకు నార్త్ లో తక్కువ రోజుల్లో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమా ఇదే. అయితే ఇక్కడ నుంచే ఈ చిత్రానికి అసలైన సవాలు ఎదురుకాబోతోంది.
'కేజీయఫ్' ప్రాంఛైజీలో తెరకెకెక్కిన చాప్టర్-2 ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఆడియన్స్ ని పెద్ద సంఖ్యలో థియేటర్లకు రప్పించే సినిమా కాదు. ఇప్పటి వరకు మాస్ ప్రేక్షకులే ఈ చిత్రాన్ని ఆదరించారు. ఇకపై ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు తీసుకెళ్తేనే భారీ వసూళ్లు సాధ్యమవుతుంది.
'బాహుబలి 2' సినిమా నార్త్ బాక్సాఫీస్ వద్ద రూ. 510 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించింది కాబట్టే లాంగ్ రన్ లో అలాంటి నంబర్ సాధ్యమైంది. కానీ ఇక్కడ 'కేజీఎఫ్ 2' పరిస్థితి వేరుగా ఉంది. దీని కారణంగానే రోజురోజుకు డ్రాప్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
దీనికి తోడు ఇప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ 'జెర్సీ' సినిమా బరిలో నిలిచింది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే హిందీ బెల్ట్ లో 'బాహుబలి 2' వసూళ్లను 'KGF 2' సినిమా అధిగమించడం అసాధ్యంగా కనిపిస్తోంది. కనీసం దరిదాపుల్లోకి కూడా రాకపోవచ్చని బాలీవుడ్ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
బాక్సాఫీస్ వసూళ్ల పరంగా హిందీలో అత్యధిక సినిమాలు పరిశీలిస్తే.. 'బాహుబలి 2' (510 కోట్లు) - దంగల్ (387 కోట్లు) - సంజు (342 కోట్లు) - PK (340 కోట్లు) - టైగర్ జిందా హై (339 కోట్లు) వంటి సినిమాలు టాప్-5 లో ఉన్నాయి. అంటే అమీర్ ఖాన్ - సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్ నటించిన సినిమాలే 'బాహుబలి 2' రికార్డులను అధిగమించలేకపోయాయి.
ఇప్పుడు 'కేజీఎఫ్ 2' కి కూడా ఆ స్థాయిని అందుకోవడం దాదాపు అసాధ్యమనే అనిపిస్తోంది. కాకపోతే 'దంగల్' వసూళ్లను బీట్ చేయగలిగితే.. హిందీ మార్కెట్ లో 'KGF 2' మూవీ రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ ప్రభావం బాక్సాఫీస్ వద్ద ఎలా ఉంటుందో చూడాలి.