రామారావు-రామ్ చ‌ర‌ణ్ ల‌తో కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్లాన్!

Update: 2022-11-14 10:30 GMT
తెలుగు లో స్ట్రెయిట్ గా సినిమా తీసి త‌మిళం స‌హా ఇత‌ర ద‌క్షిణాది భాష‌ల్లోకి అనువ‌దించి రిలీజ్ చేయ‌డం ఒక ప‌ద్ధ‌తి. అలా కాకుండా తెలుగు-త‌మిళం (లేదా వేరే ఏదైనా భాష‌) ద్విభాషా చిత్రంగా ప్ర‌క‌టిస్తే.. రెండు భాష‌ల్లో ఒకేసారి స‌న్నివేశాల్ని తెర‌కెక్కించాల్సి ఉంటుంది. ఆయా సినిమాలో న‌టించే హీరో రెండు భాష‌ల కోసం రెండు టేక్ లు వ‌రుస‌గా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక భాష కోసం ఒక‌సారి ఇంకో భాష కోసం ఇంకోసారి హీరో గారు సెట్లో కెమెరా ముందు న‌టించాల్సి ఉంటుంది. భాష మార్పుతో డైలాగుల్ని కూడా చెప్పాలి.

అయితే రెండు భాష‌ల్లో ఒకేసారి సినిమాని తెర‌కెక్కించేప్పుడు ద‌ర్శ‌కులు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. హీరో మార్పు ఉండ‌దు కాబ‌ట్టి ఇత‌ర ఆర్టిస్టుల విష‌యంలో ఇరు భాష‌ల్లో ప‌రిచ‌యం ఉన్న ముఖాల‌నే ఎంపిక చేయాలి. పైగా ఆర్టిస్టు ఇమేజ్ ని బ‌ట్టి పాత్ర‌ల కోసం ఎంపిక‌లు చేయాల్సి ఉంటుంది. ఇదంతా సంక్లిష్ట‌మైన ప్ర‌క్రియ‌. కానీ దీనిని గౌత‌మ్ మీన‌న్ లాంటి ద‌ర్శ‌కులు విజ‌య‌వంతంగా సాధించి చూపించారు.

ఇప్పుడు కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కూడా అలాంటి ప్ర‌యోగం చేయ‌బోతున్నాడు. ఇంత‌కుముందు కేజీఎఫ్ చిత్రాన్ని క‌న్న‌డ‌లో తెర‌కెక్కించి తెలుగు-హిందీ-త‌మిళం-మ‌ల‌యాళంలోకి అనువ‌దించి రిలీజ్ చేసారు. ద్విభాష‌ల్లో స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించిందేమీ లేద‌ని టాక్ వినిపించింది. కానీ అందుకు భిన్నంగా ఈసారి జూనియ‌ర్ ఎన్టీఆర్- మైత్రి మూవీని ప్ర‌శాంత్ నీల్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నార‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఎన్టీఆర్ బ‌హుభాషా జ్ఞాని. తెలుగు ఎంత సులువుగా మాట్లాడ‌తారో అంతే సులువుగా క‌న్న‌డం కూడా మాట్లాడ‌గ‌ల‌రు. త‌న సినిమాల‌కు క‌న్న‌డ‌లో త‌నే సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకుంటారు. ఇది ప్ర‌శాంత్ నీల్ కి బాగా లాభించే అంశం కావ‌డంతో తార‌క్ తో క‌న్న‌డ‌-తెలుగు ద్విభాషా చిత్రానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. అంటే జూనియ‌ర్ తెలుగు స‌న్నివేశం కోసం ఒక‌సారి.. క‌న్న‌డ సీన్ కోసం ఇంకోసారి న‌టించాల్సి ఉంటుంద‌న్న‌మాట‌. అలా ఇరు భాష‌ల కోసం సీన్స్ తీస్తారు. ఎన్టీఆర్ తో క‌లిసి స‌న్నివేశంలో న‌టించే స్టార్ల  ఎంపిక‌లో భాష‌ను బ‌ట్టి కొద్ది పాటి మార్పులు ఉండొచ్చు. ఏది ఏమైనా ప్ర‌శాంత్ నీల్ మాత్రం తార‌క్ తో సినిమాని చాలా ప‌క‌డ్భంధీగా తెర‌కెక్కించే ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది.

పాన్ ఇండియా ట్రెండ్ లో ఇప్పుడు ఏ సినిమా తీసినా అన్ని భాష‌ల ఆడియెన్ ని దృష్టిలో పెట్టుకుని తెర‌కెక్కించాల్సి ఉంటుంది. ఎంపిక చేసుకునే కాన్సెప్ట్ యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ తో ఉండాలి. బాహుబ‌లి - కేజీఎఫ్-ఆర్.ఆర్.ఆర్- పుష్ప చిత్రాలు హ‌ద్దులు చెరిపేసి అన్ని భాష‌ల్లోను ఘ‌న‌విజ‌యం సాధించాయి. అందుకే ఇప్పుడు తార‌క్ తో ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించే సినిమా అంతే యూనివ‌ర్శ‌ల్ గా పాన్ ఇండియా అప్పీల్ తో ఉండాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ఇది నిజంగా ద‌ర్శ‌కుడిపై ఒత్తిడి పెంచే అంశం. కానీ ప్ర‌శాంత్ నీల్ దీనిని ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాల‌న్న ఆస‌క్తి అంద‌రిలోను ఉంది.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా 'స‌లార్' లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్ ని మించి డ‌బుల్ యాక్ష‌న్ తో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారంటూ ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌భాస్ అభిమానుల్లో ఇప్ప‌టికే పూన‌కాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'స‌లార్' ని వ‌చ్చే స‌మ్మ‌ర్ నాటికి స‌ర్వం పూర్తి చేసి త‌దుప‌రి జూనియ‌ర్ ఎన్టీఆర్ తో సినిమా కోసం నీల్ బ‌రిలో దిగుతాడు. ఇంత‌లోనే ప్ర‌భాస్ ని మించి ఎన్టీఆర్ ని పాన్ ఇండియా స్టార్ గా చూపించాల‌ని యంగ్ టైగ‌ర్ అభిమానులు కోరుకుంటున్నారు. అందువ‌ల్ల ఆ ఒత్తిడిని ప్ర‌శాంత్ నీల్ అనుభ‌వించ‌క త‌ప్ప‌దు. ఇక వ‌రుస విజ‌యాల‌తో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ ప్ర‌శాంత్ నీల్ కి రాజీ లేకుండా పెట్టుబ‌డుల‌ను స‌మ‌కూరుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. అందుకే ఎన్టీఆర్- ప్ర‌శాంత్  నీల్ ప్రాజెక్ట్ పై బోలెడంత హైప్ నెల‌కొంది. ఇక తార‌క్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ మెగా కాంపౌండ్ లో అడుగుపెడుతాడ‌న్న చ‌ర్చ కూడా ఇప్ప‌టికే వేడెక్కించేస్తోంది. చిరు - రామ్ చ‌ర‌ణ్ ల‌తో అత‌డు ప‌ని చేసే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి ప‌ని చేస్తే అది కూడా ద్విభాషల‌తో పాన్ ఇండియా చిత్ర‌మే అవుతుంది. చ‌ర‌ణ్ కూడా మ‌ల్టీ లాంగ్వేజ్ మాట్లాడ‌గ‌ల నేర్ప‌రి. అందువ‌ల్ల ప్ర‌శాంత్ నీల్ కి ప‌ని సులువు అవుతుందని భావిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కి తెలుగులోనే కాదు అంతే పట్టు కన్నడ భాషమీద కూడా ఉంది. తల్లి స్వంత ఊరు అదే రాష్ట్రం కావడంతో సహజంగానే అక్కడి లాంగ్వేజ్ మీద గ్రిప్పు సాధించాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో, దానికి స్వంత డబ్బింగ్ ఇవ్వడంలో తారక్ చూపించిన శ్రద్ధకు శాండల్ వుడ్ మీడియా సైతం మంచి సపోర్ట్ ఇచ్చింది. ఈ అంశాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తనకు సానుకూలంగా మార్చుకోబోతున్నాడు.

త్వరలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ ప్యాన్ ఇండియా మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే దానికన్నా ముందు సలార్ పూర్తవ్వాలి. ఇటువైపు కొరటాల శివ సినిమా ఫినిష్ చేయాలి. ఎంతలేదన్నా ఆరేడు నెలలు పడుతుంది. ఎలాగూ జూనియర్ కు కన్నడ బాగా వస్తుంది కాబట్టి సలార్, కెజిఎఫ్ లా కాకుండా ఈసారి ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేయబోతున్నట్టు తెలిసింది. అంటే డబ్బింగ్ ఉండదు. ఒకే సీన్ ని రెండు భాషల్లో తీస్తారు.

ఆర్టిస్టుల్లో కొద్దిగా మార్పు ఉండొచ్చు కానీ హీరో మాత్రం అదే సన్నివేశం మళ్ళీ మళ్ళీ పెర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది.

మహేష్ బాబు స్పైడర్, శర్వానంద్ ఒకే ఒక జీవితం ఈ తరహాలో తెరకెక్కినవే. అందుకే మెయిన్ క్యాస్టింగ్ లో తేడాలను స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు తన మూవీని కూడా తెలుగు కన్నడలో తీసి హిందీతో సహా ఇతర భాషల్లో డబ్బింగ్ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. తారక్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందే ఈ సినిమాకు సంబంధించి స్టోరీ ఇప్పటికే ఫైనల్ అయ్యిందని బెంగళూరు టాక్.

కానీ డైలాగ్ వెర్షన్ కి టైం పడుతుంది. సలార్ పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నాడు. 2023 సమ్మర్ కంతా ఫస్ట్ కాపీ సిద్ధం చేసి జూనియర్ తో చేతులు కలపబోతున్నాడు. హీరోయిన్ తో సహా క్యాస్టింగ్ ఆ టైంకంతా లాక్ చేసేయాలి. కొరటాల ప్రాజెక్టుకి ఇది ఎంత పెద్ద సమస్యగా మారిందో చూసిన నేపథ్యంలో అలా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు. కెజిఎఫ్ దర్శకుడి చేతిలో తమ హీరోని ఏ రేంజ్ ఓ చూపిస్తాడనే అంచనాలు ఫ్యాన్స్ లో మాములుగా లేవు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News