సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడుతుందో.. ఎక్కడికి చేరుస్తుందో ఎవరూ చెప్పలేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో జక్కన్న అత్యంత సాహసోపేతంగా తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా వండర్ 'బాహుబలి' విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అంత వరకు వందల కోట్ల బడ్జెట్, భారీ సెట్ లు.. అబ్బుర పరిచే సీజీ వర్క్ ని వెండితెరపై ఆవిష్కరించి లార్జర్ దెన్ లైఫ్ సినిమాలని తెరకెక్కించాలంటే మేకర్స్ రిటర్న్ గురించి ఆలోచిస్తూ భయపడేవారు.
ఈ తరహా సాహసాలకు ముందుకొచ్చేవారు కాదు. కానీ వన్స్ 'బాహుబలి' రిలీజ్ తరువాత ఆ భయాలన్నీ తొలగిపోయాయి. మార్కెట్ స్థాయి.. బిజినెస్ స్థాయి కూడా భారీగా పెరిగింది. దీంతో ప్రతీ స్థార్ ఇప్పడు పాన్ ఇండియా.. వంద కోట్ల సినిమా అంటున్నాడు. దానికి కారణం 'బాహుబలి'.. ఈ మూవీ తరువాతే టాలీవుడ్ లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. తెలుగు సినిమాల బిజినెస్ రేంజ్, గుడ్ కంటెంట్ కూడా పెరిగి ప్రతీ ఒక్కరూ తెలుగు సినిమా అంటే ఆసక్తిగా ఎదురుచూసేలా వాతావరణం క్రియేట్ అయింది.
ఇలాంటి మార్పులే ఇప్పడు కన్నడ ఇండస్ట్రీలో మొదలయ్యాయి. 'కేజీఎఫ్' రిలీజ్ ముందు వరకు కన్నడ సినిమా, కన్నడ ఇండస్ట్రీ గురించి ఇతర భాషల సినీ ప్రియులు ఆసక్తిని చూపించిన దాఖలాలు లేవు. కానీ ఎప్పుడైతే 2018లో యష్ - ప్రశాంత్ నీల్ ల కలయికలో రూపొంది దేశ వ్యాప్తంగా విడుదలైన 'కేజీఎఫ్ చాప్టర్ 1' సంచలన విజయాన్ని సాధించిందో అప్పటి నుంచే కన్నడ సినిమా పేరు దేశం మొత్తం మారు మోగడం మొదలైంది.
ఈ మూవీ అందించిన జోష్ తో అక్కడి మేకర్స్ పాన్ ఇండియా స్థాయి సినిమాలని, యవత్ దేశం మొత్తం కన్నడ ఇండస్ట్రీ వైపు ఆశ్చర్యంతో చూసే సినిమాలని అందిస్తూ ఆశ్చర్య పరుస్తున్నారు. 'కేజీఎఫ్ 2' వంటి ట్రెమండస్ హిట్ తరువాత కన్నడ ఇండస్ట్రీ దేశ వ్యాప్తంగా జోరు చూపించడం మొదలు పెట్టింది. రక్షిత్ శెట్టి 'చార్లీ 777, కిచ్చా సుదీప్ 'విక్రాంత్ రోణ' వంటి సినిమాలు కన్నడ ఇండస్ట్రీ పేరు దేశ వ్యాప్తంగా మారు మోగేలా చేశాయి.
అయితే తాజాగా విడుదలైన 'కాంతారా' కన్నడ ఇండస్ట్రీని మరింత హైట్స్ కి తీసుకెళుతోంది. దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి నటించి రూపొందించిన ఈ మూవీ కన్నడ నాట సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. కన్నడ సంప్రదాయాలకి అద్దంపడుతూ రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ కన్నడ ఇండస్ట్రీ పై చర్చ జరిగేలా చేస్తోంది.
ఒకప్పుడు కన్నడ సినిమాలపై ఆసక్తిని చూపించని ప్రేక్షకులు కూడా ఇప్పడు 'కేజీఎఫ్' తరువాత కన్నడ సినిమా అంటే ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రెడిట్ గతంలో తమిళ సినిమాకే వుండేది కానీ అది క్రమ క్రమంగా కన్నడ ఇండస్ట్రీ దక్కించుకుంటూ వరుస క్రేజీ సినిమాలతో దేశ వ్వ్యాప్తంగా కన్నడ ఇండస్ట్రీపై చర్చ జరిగేలా చేస్తుండటం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.