సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో సినిమాల్లో నటించి నవ్వించి మెప్పించిన కన్నడ నటుడు మోహన్ జునేజా మృతి చెందారు. కమెడియన్ గా చాలా సినిమాల్లో నటించి విలన్ గా కూడా మెప్పించిన ఈయన గత కొన్నాళ్లుగా కాలేయ వ్యాధితో బాధ పడుతున్నారు. ఆయన మృతి వార్తలను కన్నడ సినీ వర్గాల వారు దృవీకరించారు. ఆయన మరణం పట్ల సినీ వర్గాల వారు తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేస్తున్నారు.
కమెడియన్ గా చేసిన నటీ నటులు విలన్ గా చేయడం అంటే మామూలు విషయం కాదు. కన్నడ సినిమా పరిశ్రమలో నటుడిగా ఆయన ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇటీవల విడుదల అయిన కేజీఎఫ్ సినిమా లో కూడా ఈయన నటించారు. కేవలం కన్నడ సినిమాలకే ఈయన పరిమితం కాకుండా ఎన్నో తెలుగు మరియు తమిళ సినిమాల్లో కూడా నటించి సౌత్ లో మంచి స్టార్ డమ్ ను దక్కించుకున్నాడు.
కేజీఎఫ్ రెండు పార్ట్ ల్లో కూడా కనిపించిన ఈయన మంచి పాత్రల్లో కనిపించాడు. ఆయన చివరి సినిమా గా కేజీఎఫ్ అవ్వడం ఆనందం అంటూ ఆయన సన్నిహితులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కన్నడం తో పాటు మొత్తం అన్ని భాషల్లో దాదాపుగా 150 సినిమాల్లో నటించిన మోహన్ జునేజా నటుడిగా ఎన్నో విలక్షణ పాత్రల్లో కనిపించాడు.
కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా కన్నడ బుల్లి తెర ప్రేక్షకులకు సీరియల్ ద్వారా కూడా చేరువ అయ్యాడు. కన్నడంలో మంచి విజయంను సొంతం చేసుకున్న ఒక సీరియల్ లో ఈయన నటించి మెప్పించాడు. ఆ సీరియల్ మాత్రమే కాకుండా బుల్లి తెరపై పలు కార్యక్రమాల ద్వారా కూడా మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు.
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది సన్నిహితులను మరియు మిత్రులను కలిగి ఉన్న మోహన్ జునేజా మృతి వార్త ప్రతి ఒక్కరికి శోకం ను మిగిల్చింది. 54 ఏళ్ల వయసులోనే దీర్ఘ కాలిక సమస్య తో ఆయన మృతి చెందడం దురదృష్టకరం అంటూ సన్నిహితులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.