ఈ శుక్రవారం (డిసెంబర్ 21) చెప్పుకోదగ్గ సినిమాలు నాలుగు విడుదలయ్యాయి. 'అంతరిక్షం'.. 'పడి పడి లేచే మనసు'.. 'కె జీ ఎఫ్'.. 'మారి 2'. మొదటి రెండు స్ట్రెయిట్ సినిమాలు కాగా మిగతావి డబ్బింగ్ సినిమాలు. మరి వీటిలో ఏ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిలదొక్కుకున్నాయి.. సత్తా చాటుతున్నాయి అంటే కన్నడ హీరో యాష్ నటించిన 'కె జీ ఎఫ్' ఒక్క పేరే చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
మొదటి రోజు శర్వానంద్ - సాయ పల్లవి జోడీ నటించిన 'పడి పడి లేచే మనసు' సినిమాపై భారీగా ఆసక్తి వ్యక్తం అయింది కానీ అది రెండో రోజుకు కంటిన్యూ కాలేదు. వసూళ్ళు రెండో రోజుకే డ్రాప్ అయ్యాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక 'అంతరిక్షం' రెస్పాన్స్ మొదటి రోజు నుంచే యావరేజ్ గా ఉంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో 'అంతరిక్షం' ప్రేక్షకుల్లో పెద్దగా రెస్పాన్స్ లేదు. ధనుష్ 'మారి 2' కూడా బాక్స్ ఆఫీస్ పై పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయింది.
వీటన్నిటికి భిన్నంగా మాత్రం కన్నడ డబ్బింగ్ ఫిలిం 'కె జీ ఎఫ్' తన సత్తా చాటుతోంది. మొదటి రోజు 'పడి పడి లేచే మనసు' డామినేట్ చేసినా రెండో రోజుకు 'కే జీ ఎఫ్' బాగా పుంజుకుంది. మాస్ ఎలిమెంట్స్.. హీరోయిజం ఉండే సినిమా కావడంతో రివ్యూలు.. రేటింగ్స్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు 'కే జీ ఎఫ్' కు ఓటేశారు. ఇదిలా ఉంటే షారూఖ్ ఖాన్ చిత్రం 'జీరో' భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినప్పటికీ అంచనాలు అందుకుకోలేక చతికిల పడిందని రిపోర్ట్స్ వస్తున్నాయి.
ఇన్ని కొత్త సినిమాలు రిలీజ్ అయినా లో బడ్జెట్ చిత్రం 'హుషారు' రెండో వారంలోనూ ఇంకా నిలకడగా వసూళ్ళు సాధిస్తుండడం విశేషం.