కేజీయఫ్: చాప్టర్ 2' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్లాక్ బస్టర్ 'కేజీఎఫ్' కు కొనసాగింపుగా వచ్చిన ఈ యాక్షన్ మూవీ.. పాత రికార్డ్స్ ను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఈ క్రమంలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది.
'కేజీయఫ్ 2' మూవీ థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసింది. నార్త్ ఇండియాలో అక్కడక్కడా కొన్ని థియేటర్స్ లో ఈ సినిమా రన్ అవుతోంది కానీ.. కలెక్షన్లు ఏమంత గొప్పగా లేవు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 1243 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే 2022లో బిగ్గెస్ట్ ఇండియన్ గ్రాసర్ మూవీగా 'కేజీఎఫ్ 2' నిలిచింది. అంతేకాదు వరల్డ్ వైడ్ గా అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో భారతీయ సినిమాగా రికార్డులకెక్కింది. ఈ జాబితాలో 'దంగల్' సినిమా మొదటి స్థానంలో ఉండగా.. సెకండ్ ప్లేస్ లో 'బాహుబలి 2' చిత్రం ఉంది.
ఇక భారతదేశంలో అన్ని భాషలలో కలిపి 'KGF 2' మూవీ దాదాపు రూ. 790 కోట్ల నెట్ వసూలు చేసింది. ఓవర్ సీస్ లెక్కలను పక్కన పెడితే.. ఈ చిత్రం రూ. 800 కోట్లతో ఫైనల్ రన్ ను ముగించనుంది. దీంతో ఆల్ టైమ్ డొమెస్టిక్ గ్రాసర్స్ లిస్ట్ లో ఈ సినిమా రెండో స్థానంలో నిలిచింది.
'బాహుబలి 2' సినిమా 1000 కోట్ల రూపాయలతో మొదటి స్థానంలో ఉండగా.. ఇప్పుడు రెండవ స్థానంలోకి 'KGF చాప్టర్ 2' మూవీ వచ్చి చేరింది. ఇటీవల వచ్చిన RRR సినిమా 750 కోట్ల నెట్ బిజినెస్ తో థియేట్రికల్ రన్ ముగించింది. ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్ లో ఈ రెండు సినిమాలకి దగ్గరగా ఏ హిందీ సినిమా కూడా రాలేకపోయింది.
దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు హీరో యష్ కలిసి బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించారని చెప్పాలి. హిందీ మార్కెట్ లో 'దంగల్' వంటి చిత్రాన్ని బీట్ చేయడమే కాదు.. ఓవరాల్ గా RRR సినిమా కలెక్షన్స్ అధిగమించిందీ కన్నడ మూవీ. రాబోయే రోజుల్లో 'KGF 2' రికార్డులను ఏయే సినిమాలు బ్రేక్ చేస్తాయో చూడాలి.
'కేజీయఫ్' చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిన ''కేజీయఫ్ 2'' చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్ - రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. అర్చన జాయిస్ - ప్రకాష్ రాజ్ - రావు రమేష్ - ఈశ్వరీ రావు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.
హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. రవి బస్రుర్ దీనికి సంగీతం సమకూర్చారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ వర్క్ చేశారు. 'కేజీఎఫ్ 2' చిత్రాన్ని తెలుగులో వారాహి చలన చిత్ర సంస్థ విడుదల చేసింది.