శ్రీ‌దేవిలా.. జాన్వీలా లేవ‌ని ఎగ‌తాళి చేశారు

Update: 2020-05-19 05:00 GMT
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి- బోనీక‌పూర్ వార‌సురాళ్ల గురించి తెలిసిందే. పెద్ద కూతురు జాన్వీ ఇప్ప‌టికే రైజింగ్ స్టార్ గా ఎదిగేస్తోంది. ధ‌డ‌క్ త‌ర్వాత వ‌రుస‌గా భారీ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. లాక్ డౌన్ వ‌ల్ల‌ జాన్వీ న‌టించిన కార్గిల్ గర్ల్ (గుంజ‌న్ స‌క్సేనా బ‌యోపిక్‌) చిత్రం ఓటీటీలో రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. జాన్వీ సంగ‌తి అటుంచితే.. త్వ‌ర‌లో శ్రీ‌దేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ బాలీవుడ్ ‌లో అదృష్టం ప‌రీక్షించుకోనుంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆ క్ర‌మంలోనే ఖుషీ క‌పూర్ సామాజిక మాధ్య‌మాల్లో స్వీయ ప్ర‌మోష‌న్స్ తో వేడెక్కిస్తోంది. ఇప్ప‌టికే విదేశాల్లో న‌ట‌న స‌హా ప‌లు శాఖ‌ల్లో త‌ర్ఫీదు పొందింది. తాజాగా సోష‌ల్ మీడియాలో ఖుషీ అన్న ఓ మాట యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. ఖుషీ త‌న చిన్న‌త‌నంలో చాలానే ఆత్మ‌న్యూన‌త‌కు గురైంద‌ట‌. తాజాగా రిలీజ్ చేసిన `క్వారంటైన్ టేప్స్` వీడియోలో ఖుషీ పాత సంగ‌తుల్ని గుర్తు చేసుకుంది. ``చిన్నతనంలో నా తల్లిదండ్రులను అభిమానులు చూసిన విధానం న‌న్ను ఎంతో ప్రభావితం చేసింది. నేను నా తల్లిలా కనిపించలేదు. నేను నా సోదరిలా కనిపించలేదు. కాబట్టి కొన్నిసార్లు ప్రజలు దానిని ఎత్తి చూపుతూ నన్ను ఎగతాళి చేస్తారు`` అని అంది. జాన్వీతో క‌లిసి ఖుషీ కపూర్ క్వారంటైన్ టేప్స్ వీడియోలో క‌నిపించారు.  

ఈ వీడియోలో తానేంటో ఖుషీ చెప్ప‌క‌నే చెప్పింది. ఈ వీడియోలో తల్లి శ్రీదేవి.. తండ్రి బోనీ కపూర్ ‌లతో త‌న బాల్య జ్ఞాపకాలు సహా ఇన్నాళ్లుగా ఆమె దాచుకున్న ఫోటోలు.. వీడియోల మాంటేజెస్ గా వీడియోలో ఆవిష్క‌రించారు. ఖుషీ స్వ‌యంగా దీనికి వాయిస్ ఓవ‌ర్ అందించింది. త‌న‌లోని భ‌యాల్ని.. న్యూన‌త- అభ‌ద్ర‌తా భావాన్ని కూడా ఈ వీడియోలో రివీల్ చేసింది. నేను 19ఏళ్ల అమ్మాయిని. ఎదుగుతున్నాన‌నే అనుకుంటున్నా. అర్హత ఇంకా సాధించ‌క‌పోయినా ప్రజలు నాపై ప్రశంసలు కురిపించ‌డం ఒక బ‌హుమ‌తి అని ఫీల‌వుతానని ఖుషీ అంది. అంతేకాదు... మరొకరిని సంతోష పెట్టే శక్తి నాకు ఉంది అని ఖుషీ గుర్తు చేయ‌డాన్ని బ‌ట్టి ఇక‌పై తాను న‌ట‌న‌లో ప్ర‌వేశిస్తుందా? అన్న సందేహం క‌లగ‌క మాన‌దు.

చాలా చిన్న వ‌య‌సు నుంచే విమ‌ర్శ‌లు ఎదుర్కోవ‌డం వ‌ల్ల‌.. అది ఆత్మగౌరవ సమస్యల నుంచి అభద్రతాభావం నుంచి బ‌య‌ట‌ప‌డేసింద‌ని.. అభివృద్ధి సాధించేందుకు అది సాయ‌మైంద‌ని చెప్పింది. నా ఆరోగ్యం స‌రిగా లేన‌ప్పుడు మంచి ఆహార విధానం అల‌వాటైంది. నా ఫ్యాష‌న్ విధానాన్ని మారింద‌ని  వెల్ల‌డించింది. న్యూన‌త‌ తో పోరాటం త‌ప్ప‌దు. ``మీరు మీతో మీ సొంత‌ రూపంతో ఉండ‌డ‌మే స‌రైన‌ద‌ని నేర్చుకోవాలి. ఏదైనా ఎదుర్కొనేందుకు f ** k అని అనేయ‌డం.. చేయాలనుకున్నది చేసేయటం నేర్చుకున్నాను. అలా ఉంటేనే ప్రజలు అభినందిస్తారని నేను భావిస్తున్నాను`` అని త‌న మ‌నోభావాల్ని ఆ వీడియో ద్వారా పంచుకుంది.
Tags:    

Similar News