ఊహలు గుస గుస లాడే.. నా హృదయం ఊగిసలాడే

Update: 2022-11-28 15:30 GMT
ఊహలు గుస గుస లాడే...నా హృదయం ఊగిస లాడే
ఊహలు గుస గుస లాడే...నా హృదయం ఊగిస లాడే
వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు
వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలే...అది నీకు మునుపే తెలుసు
ఊహలు గుస గుస లాడే...నా హృదయము ఊగిసలాడే

నను కోరి చేరిన బేల దూరాన నిలిచేవేల
నను కోరి చెరిన బేల దూరాన నిలిచేవేల
నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడ
ఊహలు గుస గుస లాడేనా హృదయము ఊగిసలాడే!!

.. ప్ర‌స్తుతం కియ‌రా స‌న్నివేశం చూస్తుంటే ఇందుకు త‌క్కువేమీ లేదు!  నాటి మేటి క్లాసిక్ లిరిక్ ( ఎన్టీఆర్- సావిత్రి బంధిపోటు మూవీ)లో మ‌ధురాతి మ‌ధుర‌మైన ఆణిముత్యాల్లాంటి కవితాత్మ‌క ప‌దాల‌ను వెతుక్కుంటున్నారు క‌వులుగా మారిన‌ కాళిదాసులంతా!!

బాలీవుడ్ టు టాలీవుడ్ కియ‌రా అద‌ర‌గొడుతోంది. ఇత‌ర నాయిక‌ల‌తో పోల్చి చూస్తే.. చాలా త‌క్కువ సినిమాల్లో న‌టించి ఎక్కువ పేరు కొట్టేసింది ఈ బ్యూటీ. తెలుగు-హిందీ ప‌రిశ్ర‌మ‌ల్లో మోస్ట్ హ్యాపెనింగ్ రైజింగ్ స్టార్ గా వెలిగిపోతోంది. `ఎంఎస్ ధోని` సినిమాతో యూత్ కి పిచ్చిగా న‌చ్చేసిన కియ‌రా ఆ త‌ర్వాత తెలుగులో భ‌ర‌త్ అనే నేను-విన‌య విధేయ రామా లాంటి భారీ చిత్రాల్లో అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించింది. మ‌హేష్ - చ‌ర‌ణ్ నుంచి త‌న‌కు కావాల్సినంత అండ ఉంది. బాలీవుడ్ లోను ఆఫ‌ర్ల‌కు కొద‌వేమీ లేదు. కియారా అక్కడి నుండి వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ నటి. ఆమె  పాన్‌ ఇండియా డైరెక్ట‌ర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ కొత్త చిత్రంలో కథానాయికగాను అవ‌కాశం అందుకుంది. ఈ చిత్రం త‌న కెరీర్ ని మ‌రో లెవ‌ల్ కి మ‌లుపు తిప్పుతుంద‌ని కూడా ఆశిస్తోంది.

ఈ రోజు కియ‌రా ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా క‌నిపించింది. అందుకు త‌గ్గ‌ట్టే త‌న‌ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ తో డౌట్లు పెట్టేసింది. ఒకే ఒక్క వీడియో పోస్టింగ్ చాలా ప్రశ్నలను లేవనెత్తింది. కియ‌రాలో మునుపెన్న‌డూ చూడ‌నంత ఆనందం క‌నిపిస్తోంది. అంద‌మైన చిరున‌వ్వుతో కాంతులు విరజిమ్ముతున్న వీడియోను పోస్ట్ చేసింది. ఆమె దానికి అంద‌మైన‌ క్యాప్షన్ ఇచ్చింది. ``దీన్ని ఎక్కువ కాలం రహస్యంగా ఉంచలేను! త్వరలో ప్రకటిస్తున్నాం... చూస్తూ ఉండండి... డిసెంబర్ 2వ తేదీన`` అంటూ ఊరిస్తూ హింట్ ఇచ్చింది.

అక‌స్మాత్తుగా ఈ చిన్న క్లూ యూత్ లో బోలెడ‌న్ని సందేహాల‌ను రాజేసింది. ముఖ్యంగా కుర్ర‌కారు గుండెల్లో డౌట్లు పెట్టేసింది. అంద‌గాడు ప్ర‌తిభావంతుడైన ప్రియ‌స‌ఖుడు సిద్దార్థ్ మల్హోత్రాతో తన సంబంధాన్ని అధికారికం చేస్తుందని త్వరలో అత‌డితో నిఖా ఖాయం చేసుకుంటోంద‌ని చాలా మంది భావిస్తున్నారు.

ఆ ఇద్దరూ ఒక‌రికోసం ఒక‌రు.. ఒక‌రి లోకంలో మ‌రొక‌రు జీవిస్తున్నారు.  ఒక‌రు లేని లోకాన్ని ఇంకొక‌రు ఊహించ‌కోలేరు. క‌ల‌ల లోకంలో ఇహ‌లోకాన్నే మ‌ర్చిపోతున్నార‌ని బాలీవుడ్ మీడియా ఆ ఇద్ద‌రిపైనా ప‌దే ప‌దే కొంటెగా దాడి చేస్తోంది. `షేర్షా` చిత్రంలో న‌టించేప్ప‌టి నుండి నిండా ప్రేమ‌లో మునిగి ఉన్నార‌ని పుకార్లు వచ్చాయి. ఇటీవ‌ల వ‌రుస‌గా ఈ జంట ర‌క‌ర‌కాల అకేష‌న్ల‌లో చ‌నువుగా మెలుగుతూ మ‌రింత‌గా సందేహాలు రేకెత్తించింది. సిద్ధార్థ్ ఇంట్లోంచి వెళుతూ ప‌దే ప‌దే కెమెరాల‌కు కియ‌రా పట్టుబ‌డిన సందర్భాలున్నాయి. అందుకే ఇక ఈ ప్రేమ‌ప‌క్షులు త్వ‌ర‌గా ఒక గూటికి చేరిపోయే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అంతా భావిస్తున్నారు.

తాజాగా రిలీజ్ చేసిన  వీడియోలో త‌న్మ‌యానందంలో ఉన్న కియ‌రా నిజంగానే ఒక శుభ‌వార్త మోసుకొస్తుంద‌ని అభిమానులు ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు. కానీ ఈ వీడియో ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ లేదా త‌న‌ కొత్త సినిమాకి సంబంధించినది అయినా కావచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. డిసెంబరు 2 నాటికి కియ‌రా జీవితంలో అస‌లేం జ‌రుగుతోందో క‌చ్ఛితమైన విషయం తెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News