పరిశ్రమలో ప్రవేశించిన కేవలం ఐదేళ్లకే అసాధారణ స్టార్ డమ్ ని అందిపుచ్చుకుంది కియరా అద్వాణీ. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కేటగిరీలో నిలిచింది. మరోవైపు ముంబై ఫ్యాషన్ ప్రపంచంలో ఎదురే లేని క్యాట్ వాక్ క్వీన్ గా వెలిగిపోతోంది. ఇక అందంలో ప్రతిభలో ఈ అమ్మడికి తిరుగేలేదని ఇప్పటికే ప్రూవైంది.
ఎం.ఎస్.ధోని - యాన్ అన్ టోల్డ్ స్టోరి.. భరత్ అనే నేను చిత్రాలతో విజయాలు అందుకుంది. లస్ట్ స్టోరీస్ తో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వరుసగా క్రేజీ సినిమాల్లో నటిస్తోంది. కిలాడీ అక్షయ్ కుమార్ సరసన లక్ష్మీ బాంబ్.. గుడ్ న్యూస్ చిత్రాల్లో కియరానే కథానాయిక. 2019 కియరాకి అన్నిరకాలుగా కలిసొచ్చింది. అలాగే ఇందూ కి జవానీ- షేర్ షా-భూల్ బులయా 2 చిత్రాలతో కియరా క్షణం తీరిక లేకుండా ఉంది.
అయితే ఇంత బిజీలోనూ కియరా బరువును అదుపులో ఉంచుకునే ఆరోగ్య సూత్రాల్ని మాత్రం అస్సలు విడిచిపెట్టదు. నిరంతరం జిమ్ కి వెళ్లి వ్యాయామం చేస్తుంది. ఆహార నియమాల్ని స్ట్రిక్టుగా పాటిస్తుంది. ఏం తింటే అందం ఆరోగ్యం కాపాడుకోవచ్చు అన్నది తనకు బాగా తెలుసు. దానికి స్కిప్ కొట్టకుండా క్రమశిక్షణగా పాటిస్తుందట. శారీరక వ్యాయామంతో క్యాలరీలు అధికంగా ఖర్చు అవ్వడం ఇంపార్టెంట్. దానికి జిమ్ కి వెళ్లాలి. రోజూ క్రమం తప్పకుండా ఓట్ మీల్ తీసుకుంటే కొవ్వును తేలికగా తగ్గించుకోవచ్చు. నీరు తాగడం ఆరోగ్యానికే కాదు.. అందానికి అత్యవసరం అని చెప్పింది. అంతేకాదు ఉప్పు కారం సహా దినుసుల్ని ఏ మోతాదులో తీసుకోవాలో కూడా కియరా వెల్లడించింది. కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ తనకు ఎంతగానో సహకరిస్తోందట. డిటాక్సిఫికేషన్ శరీరం నుంచి విషపదార్థాల్ని తొలగిస్తుంది అంటూ ఎన్నో తెలియని విషయాల్ని అభిమానులతో షేర్ చేసుకుంది. బరువు తగ్గడానికి ఇంకా ఎన్నో లాజిక్ లు టిప్స్ కూడా చెప్పింది. ఇప్పటికైనా అర్థమైందా కియరా.. మోనాలిసా రూపం వెనక కఠోర శ్రమ ఎలాంటిదో?
వీడియో కోసం క్లిక్ చేయండి