సీఎం గాళ్ ఫ్రెండ్ గ్లామర్ అదిరిందే

Update: 2018-04-09 04:15 GMT
మహేష్ బాబు అండ్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భరత్ అనే నేనుపై అంచనాలను అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి బజ్ బాగా ఉండగా.. రీసెంట్ గా జరిగిన భరత్ బహిరంగ సభ సమక్షంగా.. హిట్టుకు హీరో దర్శకుడు ఇధ్దరూ హామీ ఇచ్చేయడంతో హైప్ ఇంకా పెరిగిపోతోంది.

ఈ చిత్రంలో మహేష్ కు జోడీగా.. సాక్షాత్తూ ముఖ్యమంత్రికి గాళ్ ఫ్రెండ్ పాత్రలో నటించే అవకాశాన్ని బాలీవుడ్ భామ కియారా అద్వానీ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ పాత్రకు ఒక కొత్త అమ్మాయే కావాలని వెతికి వెతికి మరీ పట్టుకొచ్చామని దర్శకుడు చెప్పాడు. గతంలో ధోనీ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామకు.. ఇది తొలి స్ట్రెయిట్ మూవీ. భరత్ అనే నేను చిత్రంలో హీరో సీఎం అనేది ఎంత ఇంపార్టెంట్ పాయింట్ గా ఉంటుందో.. హీరోయిన్ తో లవ్ ట్రాక్ కూడా అంతే రక్తి కడుతుందట. మరి సీఎంకి జీఎఫ్ కదా అని గ్లామర్ డోస్ ఉండదేమో అని కొందరు ఇప్పటికే బెంగ పెట్టేసుకున్నారు.

అయితే.. మాస్ అంశాలను పక్కాగా దట్టించే కొరటాల శివ.. ఈ విషయంలోనూ లోటు చేసినట్లుగా అనిపించడం లేదు. మేకింగ్ ఆఫ్ భరత్ అనే నేను వీడియోలో.. కియారాకు కూడా స్థానం లభించింది. పాటలలో కియారా ద్వారా గ్లామర్ డోస్ ఏ రకంగా అందించిందో ఓ ట్రయల్ పార్ట్ చూపించేశారు మేకర్స్. ఆన్ స్క్రీన్ పై ఈ అందాల భామ ఇంకెంత రచ్చ చేయనుందో!
Tags:    

Similar News