క్షణం తీరిక లేని షెడ్యూళ్ల నడుమ ఏమాత్రం సమయం చిక్కినా కియరా అద్వాణీ ఏం చేస్తుందో తెలుసా? ఆ సమయంలో ఫుల్ రిలాక్స్ మోడ్ లోకి వెళ్లేందుకు ఈత కొలనుకు వెళుతుంది. అక్కడ స్విమ్ చేస్తూ బోలెడంత ఎంజాయ్ చేస్తుంది. ఈత అన్నా.. బ్లూ వాటర్స్ అన్నా తనకు చాలా చాలా ఇష్టం. అందుకే 2021 నూతన సంవత్సర వేడుకల కోసం కియరా చడీచప్పుడు లేకుండా సీక్రెట్ బోయ్ ఫ్రెండ్ తో కలిసి మాల్దీవులకు వెళ్లింది.
గోవా బీచ్ లకు వెళ్లేందుకు కియరా చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇక విదేశీ విహారాలు ఒంటరి బీచ్ లను అస్సలు వదిలిపెట్టదు. అలాగే వాటర్ స్పోర్ట్స్ ని కూడా కియరా అమితంగా ఇష్టపడుతుంది. తాజాగా కియరా షేర్ చేసిన ఓ వీడియో కుర్రకారు గుండెల్లో అగ్గి రాజేసింది.
ఆక్వేరియంలో చేపలా కియరా బులుగు సముద్రంలో ఎంతో స్వేచ్ఛగా ఈదేస్తోంది. అక్కడ రంగురంగుల వర్ణాల్లో అందమైన చేపలు ఈదుతుంటే వాటితో పోటీపడుతూ కియరా ఈత కొడుతున్న వైనం సర్ ప్రైజ్ ట్రీట్ అనే చెప్పాలి. ఆలివ్ గ్రీన్ బికినీలో అచ్చం బికినీ మత్స్యాన్ని తలపించింది ఈ బ్యూటీ. కియరా కెరీర్ మ్యాటర్ కి వస్తే...సిద్ధార్థ్ మల్హోత్రా సరసన `షెర్షా` లో కనిపిస్తుంది. ఈ చిత్రం జూలై 2 న విడుదల కానుంది. వరుణ్ ధావన్- అనిల్ కపూర్- నీతు కపూర్ లతో `జగ్ జగ్ జీయో`లోనూ కియరా నటిస్తోంది. భూల్ భులయ్యా చిత్రంలోనూ కియరా కథానాయిక.Full View
గోవా బీచ్ లకు వెళ్లేందుకు కియరా చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇక విదేశీ విహారాలు ఒంటరి బీచ్ లను అస్సలు వదిలిపెట్టదు. అలాగే వాటర్ స్పోర్ట్స్ ని కూడా కియరా అమితంగా ఇష్టపడుతుంది. తాజాగా కియరా షేర్ చేసిన ఓ వీడియో కుర్రకారు గుండెల్లో అగ్గి రాజేసింది.
ఆక్వేరియంలో చేపలా కియరా బులుగు సముద్రంలో ఎంతో స్వేచ్ఛగా ఈదేస్తోంది. అక్కడ రంగురంగుల వర్ణాల్లో అందమైన చేపలు ఈదుతుంటే వాటితో పోటీపడుతూ కియరా ఈత కొడుతున్న వైనం సర్ ప్రైజ్ ట్రీట్ అనే చెప్పాలి. ఆలివ్ గ్రీన్ బికినీలో అచ్చం బికినీ మత్స్యాన్ని తలపించింది ఈ బ్యూటీ. కియరా కెరీర్ మ్యాటర్ కి వస్తే...సిద్ధార్థ్ మల్హోత్రా సరసన `షెర్షా` లో కనిపిస్తుంది. ఈ చిత్రం జూలై 2 న విడుదల కానుంది. వరుణ్ ధావన్- అనిల్ కపూర్- నీతు కపూర్ లతో `జగ్ జగ్ జీయో`లోనూ కియరా నటిస్తోంది. భూల్ భులయ్యా చిత్రంలోనూ కియరా కథానాయిక.