ఎం.ఎస్.ధోని చిత్రంలో సాక్షి పాత్రలో నటించి మనసు దోచిన కియరా అద్వాణీ మహేష్ లాంటి స్టార్ హీరో సరసన `భరత్ అనే నేను` చిత్రంలో నటించింది. ద్వితీయ ప్రయత్నం రామ్ చరణ్ సరసన `వినయ విధేయ రామ` చిత్రంలో ఛాన్స్ అందుకుంది. ఈ రెండు సినిమాల ఫలితం గురించి తెలిసిందే. ఈ రెండిటి తర్వాతా కియరా నటించే సినిమా ఏది? అంటూ టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇదే ప్రశ్న కియరానే అడిగితే ఏం చెప్పిందో తెలుసా? .. టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో సరసన కథానాయికగా నటించబోతున్నా. అతడు ఎవరో తర్వాత చెబుతాను అంటూ దాట వేసింది. ఇక బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ లో తన పాత్ర ఆసక్తికరంగా మలిచారని, తెలుగు వెర్షన్ తో ఏమాత్రం పోలిక ఉండదని కియరా తెలిపింది. ఇక తెలుగు సినీపరిశ్రమలో ఘనమైన ఆరంగేట్రంపైనా ఎంతో ఆనందం వ్యక్తం చేసిన కియరా పలు ఆసక్తికర సంగతుల్ని ముచ్చటించింది.
కొరటాల ఏ ముహూర్తాన పరిచయం చేశారో కానీ.. అంటూ తన టేకాఫ్ గురించి ఉబ్బితబ్బిబ్బయ్యింది కియరా. కెరీర్ ఆరంభమే అభిమానులు తనని ధోని సినిమా సాక్షి వి కదా? అని అడిగేస్తుంటే ఎంతో ఆనందించే దానినని తెలిపింది. తెలుగులో సినిమాల్ని ఏ ప్రాతిపదికన ఎంచుకుంటారు? అని ప్రశ్నిస్తే కథ నచ్చితే వెంటనే ఓకే చేసేస్తానని కొరటాల, బోయపాటి వినిపించిన కథలు నచ్చి ఓకే చేశానని తెలపింది. తనకు భాషా భేధం లేనేలేదని అంది. మీరు తెలుగులో చేసిన రెండు సినిమాల్లో రెండు విభిన్నమైన పాత్రలు చేశారు. ఈ రెండింటిలో దేనికోసం ఎక్కువ శ్రమించారు? అని ప్రశ్నిస్తే.. క్లాస్ ని కానీ, మాస్ ని కానీ మెప్పించడం అంత తేలికేం కాదు. వసుమతిగా క్లాస్‌గా కనిపిస్తే, సీతగా మాస్ పాత్రలో కనిపించాను. రెండు పాత్రలు వేటికవే ప్రత్యేకం.. అవి రెండూ పేరు తెచ్చాయి అని తెలిపింది. ఇక చిన్నప్పటి నుంచి చక్కని డ్యాన్సర్ నే అయినా చరణ్ తో కలిసి స్టెప్పులేసేందుకు చాలానే ఇబ్బంది పడ్డానని కియరా అంది.
మహేష్, చరణ్ క్వాలిటీస్ గురించి మాట్లాడుతూ.. ఆ ఇద్దరూ ఫ్యామిలీ మ్యాన్స్ అంటూ కితాబిచ్చేసిన కియరా.. ఆ క్వాలిటీ తనని ఎంతో మెప్పించిందని తెలిపింది. ఆ ఇద్దరి ఇంటి నుంచి సెట్స్ కి క్యారేజీ వచ్చేది. హోమ్ ఫుడ్ తిని ఆనందించే దానిని. అలా నమ్రత - ఉపాసనతో మంచి స్నేహం కుదిరిందని కియరా తెలిపింది. ఇక లస్ట్ స్టోరీస్ తో వెబ్ సిరీస్ నటిగా పేరొచ్చిందని మునుముందు వెబ్ సిరీస్ లలో ఛాన్సులు వస్తే నటిస్తానని తెలిపింది. అదో మినీ మూవీ ఎక్స్ పీరియన్స్ అని తెలిపింది. కరణ్ జోహార్ ఓసారి కాల్ చేశారు. ఏదో పార్టీకి పిలిచారని అనుకున్నా కానీ ఇలా లస్ట్ స్టోరీస్ కోసం పిలిచారని అనుకోలేదంటూ అసలు గుట్టు లీక్ చేసింది.