బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ క్రేజీ హీరోయిన్స్ జాబితాలో కియారా అద్వానీ కూడా ఒకరు అనడంలో సందేహం లేదు. ఈ అమ్మడు తెలుగు లో భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ సినిమాల్లో నటించింది. ఆ సినిమాల్లో నటిస్తున్న సమయలో బాలీవుడ్ లో ఈ అమ్మడికి పెద్ద ఆఫర్లు లేవు.. పైగా స్టార్ డమ్ కూడా లేదు. కనుక అప్పుడు తెలుగు సినిమాలో నటించింది. ఇప్పుడు బాలీవుడ్ లో ఇంత బిజీగా ఉన్న ఎలా ఆర్ సీ 15 సినిమాలో నటిస్తుందనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.
హిందీ ప్రేక్షకులకు కబీర్ సింగ్ సినిమా తో చేరువ అయిన ఈ అమ్మడు ప్రస్తుతం స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూ భారీ పారితోషికం దక్కించుకుంటుంది. సౌత్ లో ఆర్ సీ 15 లో నటించేందుకు గాను ఈ అమ్మడికి అంతకు మించిన ఆఫర్ ను శంకర్ ఇచ్చేందుకు ఓకే చెప్పాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. పైగా ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అవ్వడంతో పాటు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అవ్వడం వల్ల కియారా అద్వానీ ఓకే చెప్పిందట.
భారీ పారితోషికం తో పాటు మంచి పాత్ర లభిస్తే తెలుగు వంటి పాన్ ఇండియా మార్కెట్ ఉన్న సినిమాల్లో నటించేందుకు ఏ హీరోయిన్ అయినా నో చెప్పదు. కియారా అద్వానీ కూడా అవే లెక్కలు వేసుకుని.. ఈ తెలుగు తమిళ ద్వి భాషా చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పి ఉంటుందని కామెంట్స్ వస్తున్నాయి. పాన్ ఇండియా సినిమా అవ్వడం వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా ఆమె భావించి ఉంటుంది.
కియారా అద్వానీ ఈ సినిమాతో ఖచ్చితంగా ఒక మంచి డీసెంట్ హిట్ ను సౌత్ లో దక్కించుకోబోతుంది. ఇప్పటికే ఆమె తెలుగు లో నటించిన రెండు సినిమా ల్లో భరత్ అనే నేను బాగానే ఆడినా... వినయ విధేయ రామ ఫలితం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. ఇప్పుడు సౌత్ లో కియారా అద్వానీకి మంచి బ్రేక్ రావాలంటే ఇలాంటి ఒక పాన్ ఇండియా మూవీ కావాలి. అందుకే కియారా అద్వానీ ఈ సినిమా ఓకే చేసిందనే వార్తలు వస్తున్నాయి.
ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ఉత్తరాదిన కూడా మంచి గుర్తింపును దక్కించుకున్న రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ సీ 15 సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
కియారా అద్వానీ మాత్రమే కాకుండా ఈ సినిమా లో అంజలి కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆర్ సీ 15 సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.