బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని 'లస్ట్ స్టోరీస్' సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో కూడా 'భరత్ అనే నేను' తో ఒక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది కానీ తన రెండో సినిమా 'వినయ విధేయ రామ' నిరాశ పరిచింది. హిట్లు ఫ్లాపులు కామనే గానీ వయసులో ఉన్నప్పుడు హాట్నెస్ మాత్రం పర్మనెంట్ కదా..? అందుకేనేమో రీసెంట్ గా డబూ రత్నాని క్యాలెండర్ ఫోటో షూట్ లో పాల్గొని అందాలను వయ్యారంగా రంగరించి మరీ కెమెరా కోసం కుమ్మరించింది.
బాలీవుడ్ లో ఫేమస్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అయిన డబూ రత్నాని ప్రతి సంవత్సరం హాట్ బ్యూటీల ఫోటోలతో క్యాలెండరు రిలీజ్ చేస్తుంటాడు. డబూ రత్నాని క్యాలెండర్ పేరుతోనే రిలీజ్ అయ్యే ఈ క్యాలెండర్ కు చాలా క్రేజ్ ఉంది. ఈ క్యాలెండర్ పేజీలపై తమ ఫోటోలు ఉండడం ఒక ఘనతగా భావిస్తారు అప్కమింగ్ హీరోయిన్లు. అలాంటి క్రేజీ క్యాలెండరు కోసం కియారా అద్వాని ఫోటో షూట్లో పాల్గొంది. ఈ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు గతంలో లీక్ అయ్యాయి గానీ అవి మంచి క్వాలిటీ ఫోటోలు కాదు. తాజాగా కియారా డబూ రత్నాని క్యాలెండర్ పై పోజిచ్చిన తన ఫోటోను ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.
దీనికి ఆమె ఇచ్చిన క్యాప్షన్ "డెబ్యూ అనేది ఎప్పుడు ప్రత్యేకమే. ఈ క్యాలెండర్ 20 వ ఎడిషన్ లో నాకు అవకాశం ఇచ్చినందుకు డబూ రత్నాని.. మనిషా డీ రత్నాని లకు థ్యాంక్ యూ." ఇక ఫోటో ఎలా ఉంది అంటే ఒక లెదర్ కవర్ ఉన్న చెక్క పెట్టెపై వయ్యారంగా కూర్చుంది. స్టోన్స్ ఎంబ్రాయిడరీ తో ఉన్న ఒక డెనిమ్ షర్ట్ ను తన అందాలకు అచ్ఛాదనగా మాత్రమే కప్పుకుంది. అంతటి అందాన్ని ఎంత డెనిమ్ షర్ట్ అయినా ఎలా దాచగలదు? ఆ డెనిమ్ చొక్కాకు అది శక్తికి మించిన పనైపోయింది. అందుకే తన వీపుభాగం.. అందమైన కాళ్ళు డబూ రత్నాని కెమెరా కళ్ళకు.. ఆయన పుణ్యమా అని నెటిజనులకు కనిపిస్తున్నాయి. యాక్సెసరీస్ అసలేవీ లేకుండా.. లూజ్ హెయిర్ తో.. హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో క్యాలెండర్ ను హాటుగా మార్చేసింది. ఈ ఫోటో ను పోస్ట్ చేసిన గంటలోపే రెండు లక్షలకు పైగా లైకులు వచ్చాయి.