ఫోటో స్టోరీ: కియారా గారి గ్లామరైజేషన్!

Update: 2020-06-02 08:50 GMT
ప్రస్తుతం హిందీలో భారీ క్రేజ్ ఉండే హీరోయిన్ల లిస్టు తీస్తే అందులో కియారా అద్వాని పేరు తప్పనిసరిగా ఉంటుంది.  మిగతా హీరోయిన్లు అందరూ సినిమాలతోనూ.. మహా అంటే యాడ్స్ తోనూ బిజీగా ఉంటారు. కానీ కియారా మాత్రం వాటితో పాటు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అయ్యే లస్ట్ స్టోరీస్.. గిల్టీ లాంటి వాటిలో కూడా నటిస్తూ తనో విభిన్నమైన క్యారెక్టర్ అని నిరూపించుకుంది.

ఇక మ్యాగజైన్ కవర్ పేజిలపై మెరవడం.. లోపలి పేజీలలో గ్లామరస్ గా కనిపించడం.. ఫోటో షూట్లు చెయ్యడం కియారాకు కామన్.  సరిగ్గా ఫోటో షూట్ చేస్తే కియారా దెబ్బకు సోషల్ మీడియా షేక్ కాకుండా ఉండదు. తాజాగా ఈ భామ మరోసారి అలాంటి షేక్ చేసే తరహా ఫోటో షూట్ చేసింది. రెడ్ కలర్ డ్రెస్ ధరించి వయ్యారంగా సింగారించుకుని ఓరచూపు చూస్తూ ఓ  ఖడ్గం లాంటి భంగిమలో నిలుచుని ఫోటోగ్రాఫర్ పనిని సులువు చేసింది.  ఆ స్లీవ్ లెస్ డ్రెస్ డిజైన్ చేసిన వ్యక్తికి నోబెల్ బహుమతి.. కుట్టిన టైలర్ కు మరేదైనా ఆస్కార్ అవార్డు ఇస్తే గానీ వారి ప్రతిభను గుర్తించినట్టు కాదు.  అవేవో సూపర్ అవార్డులు..  ఎవరికీ రావు అని ఫిక్స్ అయిపోతే అంతకంటే అమాయకత్వం మరొకటి లేదు.

అసలు ఈ ఫోటో చూస్తే కియారాకు గ్లామర్ కేరాఫ్ అడ్రెస్సా లేకా గ్లామర్ కే కియారా కేరాఫ్ అడ్రెసా అనేది అనుమానం రాకమానదు. ఇక కియారా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'భూల్ భులయ్యా 2'.. 'లక్ష్మి బాంబ్'.. 'షేర్ షా'.. 'ఇందూ కీ జవాని' సినిమాల్లో నటిస్తోంది.
Tags:    

Similar News