ఇటీవలే పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాను ప్రకటించాడు మహేష్ బాబు. ఆగస్ట్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి నటీనటుల్ని ఎంపిక చేసే ప్రాసెస్ మొదలైంది. ఇందులో భాగంగా ఈ చిత్రంలో ప్రధాన విలన్ గా కన్నడ హీరో ఉపేంద్ర బాగుంటాడని మొదట్లో దర్శకుడు భావించాడట. ఉపేంద్ర.. చివరగా త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో విలన్‌గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లకు మహేష్ సినిమా ద్వారా మళ్ళీ తెలుగులో రీఎంట్రీ ఇస్తాడని అనుకున్నారు. ఉపేంద్ర హీరోగా ఇప్పటికే కన్నడలో ఒక స్టార్ గా ఎదిగారు. ఇక ఇతర సినిమాల్లో గెస్ట్ రోల్స్ కోసం ఆయన ఎప్పుడైనా సిద్ధంగా ఉంటారు. నిజానికి మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో ఓ కీలక పాత్రకు కూడా ఇతన్ని సంప్రదించారు. అయితే అప్పుడు కుదరలేదట. అయితే ఈసారి మాత్రం ఒప్పుకుంటాడని.. మహేష్ బాబుతో కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు అనుకున్నారు.
కానీ తాజాగా మరో కన్నడ హీరో సుదీప్ పేరు తెరపైకి వచ్చింది. సర్కారు వారి పాట సినిమాలో విలన్ పాత్ర కోసం సుదీప్ ను తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. స్క్రిప్ట్ విన్న సుదీప్, మహేష్ కు ప్రతినాయకుడిగా నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే 30 రోజులు మాత్రమే కాల్షీట్లు ఇచ్చాడని, ఆ టైమ్ లో షూట్ పూర్తిచేయాల్సి ఉంటుందని కండిషన్ కూడా పెట్టాడని అంటున్నారు. నిజానికి విలన్ గా నటించడానికి ఉపేంద్రకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ప్రస్తుతం ఉపేంద్రకు చాలా కమిట్ మెంట్స్ ఉన్నాయట. లాక్ డౌన్ వల్ల కాల్షీట్లన్నీ వృథా అయ్యాయట. కాబట్టి మహేష్ సినిమాకు ఇప్పట్లో కాల్షీట్లు కేటాయించలేడని సన్నిహిత వర్గాలు తెలిపాయట. అందుకే ఆ అవకాశం సుదీప్ ను వరించిందని టాక్. సుదీప్ చివరగా సైరా నరసింహరెడ్డి సినిమాలో కనిపించాడు. త్వరలోనే సర్కారు విలన్ ఎవరు అనేది క్లారిటీ రావాల్సి ఉంది.