టాలీవుడ్ లో లీకులే లీకులు. వీడియోలే కాదు సినిమా రిలీజ్ ముందే కథలు కూడా లీకైపోతున్నాయి. అప్పట్లో మగధీర కథ ఇదీ అంటూ రకరకాల కథల్ని అల్లేసి వెబ్ లో ముందస్తు ప్రచారం చేశారు. ఆ తర్వాత చాలా సినిమాల కథల్ని ముందుగా ఊహించి కథలుగా చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత వాటిల్లోంచి మెజారిటీ భాగం ఊహించినట్టే ఉండడంతో నిజంగానే కథలు లీకేజీ కూడా యూనిట్‌లోని ఎవరో ఒకరి వల్ల జరుగుతోందని అర్థమైపోతోంది. లేటెస్టుగా కిక్ 2 యూనిట్‌లో ఎవరు లీక్ చేశారో తెలీదు కానీ, ఈ కథ కూడా లీకైపోయింది.
రాబిన్ హుడ్ (రవితేజ) ఇండియాలో ఉన్న తన ఆస్తులన్నీ అమ్ముకుని అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడాలనుకుంటాడు. అక్కడ ఓ పెద్ద కార్పొరెట్ ఆస్పత్రి కట్టుకుని డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు. అయితే ఈలోగానే అనుకోకుండా తనకి యాక్సిడెంట్ జరుగుతుంది. కోలుకోవాలంటే ఇండియా వెళ్లి కొంత కాలం విశ్రాంతి తీసుకోవాల్సిన సందర్భం వస్తుంది. అలా ఇండియా వచ్చిన రాబిన్ హుడ్ కి ఓ అందమైన అమ్మాయి (రకూల్) కనిపిస్తుంది. చూడగానే ప్రేమలో పడిపోతాడు. తనకోసం బ్రహ్మానందం ఇంటిలో పేయింగ్ గెస్ట్ గా చేరతాడు. అక్కడ ప్రేమకథ నడిపిస్తుంటాడు. ఇంతలోనే రకూల్ కిడ్నాప్. అక్కడే ఇంటర్వెల్.
ఆ తరువాత రకుల్ ను వెతుక్కుంటూ ఓ గ్రామానికి వెళ్లాల్సొస్తుంది. అక్కడ సరిగ్గా విలన్ సాల్మన్ సింగ్ ఠాకూర్ (రవికిషన్) తగులుతాడు. అతడి అరాచకాలు తెలిసొస్తాయి. అలా తెలిసొచ్చేలా చేసేందుకు కిడ్నాప్ అంటూ డ్రామా ఆడుతుంది రకూల్. తండ్రిని చంపిన దుర్మార్గుడు సాల్మన్ ని చంపేయమని రాబిన్ హుడ్ ని అడుగుతుంది. కానీ అందుకు రాబిన్ సిద్ధంగా ఉండడు. ఇండియా వచ్చింది చంపడానికి కాదు, ఆస్తులు అమ్మి అమెరికా వెళ్లిపోవడానికి అని చెబుతాడు. మరి అలాంటప్పుడు ప్రేయసి కోసం ఆ ప్రియుడు ఏమీ చేయలేదా? చేస్తే ఏం చేశాడు? అన్నదే మిగిలిన సినిమా... అంటూ ఇప్పుడు సోషల్ నెట్ వర్కులో ఈ కథ ప్రచారమవుతోంది.
కిక్కొచ్చిందా? డబుల్ కిక్కిచ్చిందా? లేదా? టూ డేస్ వెయిట్ చేయండి మష్టారూ డైరక్టుగా మన రివ్యూ లో అన్నీ డిస్కస్ చేద్దాం.