వరుసగా తెరలు వీడిపోతున్నాయి. ఒక్కో సినిమాకు మోక్షం వచ్చేస్తోంది. గత వారం రోజుల్లో చాలా సినిమాల రిలీజ్ డేట్లు కన్ఫమ్ అయ్యాయి. చివరికి ‘రుద్రమదేవి’ డేటు కూడా ఫిక్సయిపోయింది. ఇక సస్పెన్స్ అంటే ఒక్క కిక్-2 విషయంలోనే. ఆ సినిమాకు పట్టిన గ్రహణం కూడా వీడిపోయింది. ఆగస్టు 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రుద్రమదేవి నుంచి పోటీ లేకపోవడంతో ఆగస్టు నెలాఖర్లో కిక్-2 విడుదల చేయడానికి మార్గం సుగమమైంది. ఆగస్టు 7న విడుదలవుతున్న ‘శ్రీమంతుడు’ ప్రభావం కనీసం రెండు వారాలుంటుంది కాబట్టి.. 22న కిక్-2ను ప్రేక్షకుల ముందు తేవాలని నిర్మాత కళ్యాణ్ రామ్ నిర్ణయించాడు.
ఆరేళ్ల కిందట రవితేజ, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘కిక్’ అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్లో కిక్ సీక్వెల్ అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కళ్యాణ్ రామ్ నిర్మాత కావడం మరింత ఆసక్తి పెంచింది. ఐతే ఇంత క్రేజ్ ఉన్నా సినిమా విడుదలకు కష్టాలు తప్పలేదు. తెర వెనుక ఏం కారణాలున్నాయో కానీ.. మేలో రావాల్సిన సినిమా వాయిదా పడి పడీ.. ఆగస్టులో విడుదల కాబోతోంది. కిక్ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ మీద నడిస్తే.. కిక్-2 యాక్షన్ నేపథ్యంలో సాగుతుందని అంటున్నాడు సురేందర్ రెడ్డి. లక్కీ గర్ల్ రకుల్ ప్రీత్ రవితేజకు జంటగా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతాన్నందించాడు. శ్రీమంతుడు సందడి తగ్గాక రిలీజ్ కు వారం ముందు సినిమాను బాగా ప్రమోట్ చేయాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడు.