టాలీవుడ్ లో ఇప్పుడు #కిల్ అనేది పెద్ద రచ్చ అవుతోంది. ఏదో ఒక వెబ్ సైట్ లో వచ్చిన రూమర్స్ ఆధారంగా చేసుకొని వెబ్ మీడియా మీద పడి ఏడవడం ఎందుకు అని కొందరు నెటిజన్లు.. క్రిటిక్స్ వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఫేక్ న్యూస్ ను కిల్ చెయ్యడం మంచి కాన్సెప్ట్. అందరూ ఒప్పుకుంటారు. అలాగే 'కిల్ ఫేక్ రికార్డ్స్ అని కూడా పిలుపు ఇస్తే బాగుంటుంది కదా అనేది కొందరు నెటిజన్లు అంటున్న మాట.
అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలను సూపర్ హిట్.. బంపర్ హిట్ ఇండస్ట్రీ హిట్ అని ప్రచారం చేసుకోవడం 'ఫేక్' కాదా? మరి ఫేక్ న్యూస్ ఉండకూడదు అని గట్టిగా కోరుతూ ఉన్నప్పుడు ఈ ఫేక్ రికార్డ్స్.. ఎందుకు ఉండాలి? డిజాస్టర్ అని తెలిసిన సినిమాలను కూడా వెబ్ సైట్లలో.. టీవీ ఛానెల్స్ లో పేపర్లలో లక్షల కొద్ది ఖర్చు పెట్టి సూపర్ హిట్ అని ప్రమోట్ చేసుకోవడం ప్రేక్షకులను మోసం చేయడమో కాదో సినీ పెద్దలు చెప్తే మంచిది.
ఒక ఉదాహరణ తీసుకుంటే ఇటీవల సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ రెండిటిలో ఒక సినిమా బంపర్ హిట్ అయ్యింది. ఆ నిర్మాత.. దర్శకుడు ఇద్దరూ ఒరిజినల్ కలెక్షన్స్ ఇచ్చారు. అయితే దానికి పోటీగా పెద్ద హీరో సినిమాకు యావరేజ్ కలెక్షన్లే వచ్చాయి. అయితే ప్యూర్ ఫేక్ కలెక్షన్లు ఇచ్చి మీడియాను మేనేజ్ చెయ్యలేదా? యావరేజ్ సినిమా మీద కోట్లు ఖర్చు పెట్టి ప్రమోషన్ చేయించుకోలేదా? ఆలాంటప్పుడు #కిల్ ఫేక్ రికార్డ్స్ అనే హ్యాష్ టాగ్ కు ఎందుకు పిలుపు ఇవ్వరని క్రిటిక్స్ అంటున్నారు. పెద్ద పెద్ద హీరోలు ప్రేక్షకులను మోసం చెయ్యడం తప్పు కదా?
ఏదేమైనా సినిమా ఇండస్ట్రీ బాగుండాలని.. సినిమాలు బతకాలని ప్రతి వెబ్ సైట్ కోరుకుంటుంది. కానీ ఒక వెబ్ సైట్ పొరపాటు చేసిందని అందరినీ ఒకే గాటన కట్టేయడం.. వెబ్ సైట్లను తిట్టడం ఎంతవరకూ న్యాయం అని సినీ క్రిటిక్స్ ప్రశ్నిస్తున్నారు. ఫ్లాప్ సినిమాలకు కూడా సూపర్ రేటింగులు ఇవ్వాలని కోరుకోవడం.. బుర్ర బద్దలు కొట్టే సినిమాలను మెచ్చుకోవాలనే విధంగా మొండిగా ప్రవర్తించడం ఏం న్యాయం? బాగున్న సినిమాను ఎవరూ నాశనం చెయ్యలేరు. లోటు పాట్లు గుర్తించి మంచి కంటెంట్ తో సినిమా తీయాల్సింది పోయి తమలోని తప్పొప్పులను చర్చిస్తున్నారనే ఉద్దేశంతో వెబ్ సైట్లను జలగల మాదిరిగా చిత్రించడం సరైనదేనా అనేది సినీ పెద్దలు ఆలోచించాలి.