హాలీవుడ్ నటి - వివాదాస్పద టీవీ హోస్ట్ కిమ్ కర్దాషియాన్ ఆమద్య ట్రంప్ గురించి మాట్లాడి ప్రపంచం దృష్టిని తనవైపుకు తిప్పుకున్న విషయం తెల్సిందే. కొన్నాళ్ల క్రితం ట్రంప్ తనకు ఫోన్ చేశారని, ఆ సమయంలో తాను నగ్నంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కూడా పలు సార్లు సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా మరో విషయంతో కిమ్ మీడియా ముందుకు వచ్చింది.
రెండు సంవత్సరాల క్రితం కిమ్ ఒక ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు ప్యారిస్ వెళ్లింది. అక్కడ ఒక అపార్ట్ మెంట్ లో బస చేసింది. కిమ్ ఒంటరిగా రూంలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న కొందరు దొంగలు ఆమె ప్లాట్ లోకి చొరబడి బాత్ రూంలో ఉన్న ఆమెను బందించి - ఆమె రూంలో ఉన్న ఖరీదైన ఆభరణాలను దొంగిలించుకు వెళ్లారు. దాదాపు 6.1 మిలియన్ డాలర్ల విలువ చేసే ఆ ఆభరణాలకు కిమ్ ముందు జాగ్రత్తగా ఇన్సూరెన్స్ చేయించింది. దాంతో తాజాగా ఆ ఇన్సూరెన్స్ మొత్తం కిమ్ కు తిరిగి వచ్చాయి.
కిమ్ దొంగిలించబడ్డ సొమ్ము మొత్తం విలువ 6.1 మిలయన్ డాలర్లు అంటే 45 కోట్ల రూపాయలను సదరు ఇన్సూరెన్స్ సంస్థ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ సమయంలో సెక్యూరిటీ గార్డ్ గా డ్యూటిలో ఉన్న వ్యక్తి బయటకు వెళ్లిన కారణంగానే ఈ దొంగతనం జరిగినట్లుగా తెలుస్తోంది. సెక్యూరిటీ గార్డ్ ఉండి ఉంటే ఈ పెద్ద దొంగతనం జరిగేది కాదు. అందుకే ఈ దొంగతనంకు కారణం అయిన సెక్యూరిటీ గార్డ్ కు, అతడిని అపాయింట్ చేసిన సెక్యూరిటీ సంస్థ 45 కోట్లు ఇవ్వాల్సిందిగా కోర్టుకు ఇన్సూరెన్స్ సంస్థ వెళ్లింది. దాంతో సెక్యూరిటీ గార్డ్ ఆ భారీ మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.