బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి దాదాపు రెండేళ్లు దాటింది. కానీ ఇంతవరకు ఆయన నుండి ఎలాంటి మూవీ తెరమీదకు రాలేదు. రెండేళ్లుగా షారుఖ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు మళ్లీ తెరపై కనిపిస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ విరామం తర్వాత షారుఖ్.. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో పఠాన్ అనే యాక్షన్ మూవీ చేస్తున్నాడు. అయితే ఇప్పటికే కింగ్ ఖాన్ తెరమీదకి రావాల్సింది కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ బ్రేక్ పడి ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే త్వరలోనే కింగ్ ఖాన్ నుండి గుడ్ న్యూస్ వినిపించబోతున్నట్లు టాక్.
అదికూడా షారుఖ్ పేరు స్క్రీన్ పై కనిపించబోతుంది. ఈ వార్త తెలిసి ఆల్రెడీ షారుఖ్ ఫ్యాన్స్ ఓ రేంజిలో సంబరపడి పోతున్నారు. కానీ షారుఖ్ పేరు స్క్రీన్ పై కనిపించడంలో కూడా ఓ ట్విస్ట్ ఉంది. ఏంటంటే.. అభిమాన నటుడు తెరపై కనిపిస్తాడని అంటే ఎవరికైనా సంతోషమే. కానీ కింగ్ ఖాన్ కనిపించబోయేది హీరోగా కాదు. త్వరలో షారుఖ్ పేరు నిర్మాతగా కనిపించనుంది. బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు.. షారుఖ్ ఖాన్ త్వరలో నిర్మాతగా ఒటిటి ప్లాట్ఫామ్లో తన సత్తా చాటబోతున్నాడు. ఆయన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మించబోయే ఓటిటి ప్రాజెక్టులకోసం ఆల్రెడీ కొన్ని స్క్రిప్ట్స్ ఓకే చేసి పెట్టినట్లు తెలుస్తుంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ లపై షారూఖ్ ప్రొడక్షన్ టీమ్ ఇప్పటికే వర్క్ ప్రారంభించిందట.
ఇదివరకు షారుఖ్.. ఇమ్రాన్ హష్మి ప్రధానపాత్రలో 'బార్డ్ ఆఫ్ బ్లడ్' 'బేతాల్' వెబ్ సిరీస్ లను నిర్మించాడు. అలాగే బాబీడియోల్ తో 'క్లాస్ ఆఫ్ 83' ప్రాజెక్ట్ నిర్మించాడు. ఈ మూడు ఓటిటి ప్రాజెక్టులకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. అయితే కింగ్ ఖాన్ ఓ నటుడు మాత్రమే కాదు. ఆయనలో ఓ గొప్ప వ్యాపారవేత్త కూడా ఉన్నాడు. ఓటిటి ప్లాట్ ఫామ్లను ఎక్కువగా వినియోగించుకోవడానికి తన టైం కేటాయిస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. 2021 ఎండింగ్ వరకు షారుఖ్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ నుండి మినిమం రెండు ఓటిటి ప్రాజెక్టులు రాబోతున్నాయని అంచనాలు నెలకొన్నాయి. చూడాలి మరి ఇదేగనక నిజమైతే ఇంకా షారుఖ్ ఓటిటిలో కూడా తన మార్క్ చూపించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.