కింగ్ ఫిక్స్ అయ్యేది 2024 లోనే!

Update: 2022-12-08 06:44 GMT
కింగ్ నాగార్జున 'ది ఘోస్ట్' రిలీజ్  త‌ర్వాత కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించ‌ని సంగతి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన ఘోస్ట్ వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. ఈ క‌థ కోసం నాగార్జున చాలా స‌మ‌యాన్నే వెచ్చించారు. అయినా శ్ర‌మంతా వృద్ధాగానే పోయింది. దీంతో నాగార్జున మ‌రింత లోతుగా ఆలోచించాల్సిన అవ‌స‌రం ప‌డింది. ఈనేప‌థ్యంలో కింగ్ నుంచి కొత్త క‌మిట్ మెంట్ వివ‌రాలు రావ‌డానికి మ‌రింత స‌మ‌యం పట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

అయితే ఇప్ప‌టికే నాగార్జున‌కు ముగ్గురు ..న‌లుగురు మేక‌ర్స్ క‌థ‌లు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌లే 'గాడ్ ఫాద‌ర్' తో స‌క్సెస్ అందుకున్న మోహ‌న్ రాజా నాగార్జున‌కి ఓ క‌థ వినిపించిన‌ట్లు తెలిసింది.

దీనిపై నాగ్ పాజిటివ్ గానే ఉన్న‌ట్లు వార్త‌లొచ్చాయి. ఈ క‌థ‌ని మెగాస్టార్  చిరంజీవి కూడా విన్న త‌ర్వాతే కింగ్ వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ట్లు వార్త‌లొచ్చాయి. చిరు వ‌ద్ద పాస్ అవ్వ‌డంతోనే రాజా నాగార్జున వ‌ర‌కూ వ‌చ్చాడ‌ని  ప్ర‌చారం సాగింది.

అలాగే త‌మిళ ద‌ర్శ‌కుడు విక్ర‌మ్. కె. కుమార్ కూడా  నాగార్జున‌కు ఇప్ప‌టికే ఓ స్ర్కిప్ట్ కూడా వినిపించారుట‌. అదీ కూడా బాగా న‌చ్చ‌డంతో చేద్దామ‌ని ప్రామిస్ చేసిన‌ట్లు స‌మాచారం. విక్ర‌మ్  స‌క్సెస్ నేప‌థ్యంలో ఛాన్సెస్ ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు ఓ కొత్త‌ ర‌చ‌యిథ  ప‌ట్ల కూడా నాగ్ సానుకూలంగానే ఉన్న‌ట్లు తెలిసింది. ఇది ఓ డిఫ‌రెంట్ జాన‌ర్ సినిమా అట‌.

విక్ర‌మ్....మోహ‌న్ రాజా క‌థ‌లకు  పూర్తి భిన్నంగా ఉంటుంద‌ని స‌మాచారం.   ఈ నేప‌థ్యంలో నాగార్జున కూడా డైల‌మాలో ఉన్న‌ట్లు వినిపిస్తుంది. ఇలా ముగ్గురు విష‌యంలో నాగార్జున పాజిటివ్ గానే ఉన్నారు. చేద్దాం అని మాటిచ్చారు త‌ప్ప అగ్రిమెంట్ జ‌రిగింది లేదు. ఈ నేప‌థ్యంలో వీట‌న్నింటిపై  కొత్త ఏడాది 2024 లోనే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

త‌దుప‌రి ఏ సినిమా చేసినా అది హిట్ అవ్వాలి. అభిమానుల్ని నిరుత్సాహ ప‌ర‌చ‌డానికి తావు ఇవ్వ కూడ‌దు. కింగ్ కి సోలో స‌క్సెస్ ప‌డి చాలా కాల‌మ‌వుతోంది. ఈనేప‌థ్యంలో త‌దుప‌రి ఏ ద‌ర్శ‌కుడితో ప‌నిచేసినా అది క‌మ‌ర్శియ‌ల్గా పెద్ద హిట్ అవ్వాల‌న్న ది నాగ్ ఐడియా గా తెలుస్తోంది. అందుకే కొత్త సినిమా విష‌యంలో అన్ని ర‌కాలుగా ఆలోచించి నిర్ణ‌యం  తీసుకునే అవ‌కాశం ఉంది. మ‌రి కింగ్ ఎలాంటి ప్ర‌క‌ట‌న‌తో ముందుకొస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News