కె.జె.ఏసుదాస్ లైవ్ షో కు అంత డిమాండా?

Update: 2019-01-19 12:19 GMT
రూ.10 వేల ఖ‌రీదు చేసే టిక్కెట్లు హాట్ కేక్ లా సేల్ అయిపోయాయి.. టిక్కెట్టు క‌నిష్ట‌ ధ‌ర రూ.3000.. గ‌రిష్టంగా రూ.10వేలు ప‌లుకుతోంది. అయినా ఆన్ లైన్ లో టిక్కెట్టు దొర‌క‌డ‌మే క‌ష్టంగా ఉంద‌ట‌. అంత డిమాండ్ ఉన్న షో ఏది? అంటే అదేమైనా  రామ్‌ చ‌ర‌ణ్ - మ‌హేష్ - ఎన్టీఆర్ సినిమా అనుకుంటే పొర‌పాటే. ఒక లైవ్ కాన్సెర్ట్ షో. లెజండరీ సింగర్ కె.జె.ఏసుదాస్ గానా మృతం కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్న త‌రుణ‌మిది. ఆయ‌న‌ యూనిక్ స్వ‌రంతో మైమ‌రిచిపోయేలా ఎంతో ఎమోష‌న్‌ తో ఆల‌పించ‌డానికి ప్రిపేర‌వుతున్నారు.

చాలా గ్యాప్ తర్వాత ఏసు దాసు హైదరాబాద్‌ లైవ్ కాన్సర్ట్ చేస్తున్నారు. జనవరి 20న హైదరాబాద్‌ లోని శిల్పకళావేదికలో ఈ కాన్సర్ట్ జరగనుంది. ఈ సంగీత విభావరిలో ఏసుదాస్‌ తోపాటు విజయ్ ఏసుదాస్ - కల్పన కూడా పాల్గొంటారు. ఈ నేపథ్యంలో జనవరి 19న కె.జె.ఏసుదాస్ - ఆయన తనయుడు విజయ్ ఏసుదాస్ విలేకరులతో ముచ్చ‌టించారు. కె.జె.ఏసుదాస్ మాట్లాడుతూ - నేను క్రిష్టియన్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ సంస్కృతంలోని అక్షరాలను నేర్చుకోమని అమ్మ‌ చెప్పారు. అది ఆమె నాకు అందించిన ఆశీర్వాదం. మరో ఆశీర్వాదం ఏమిటంటే.. నేను ఐదేళ్ళ వయసులో ఉన్నప్పుడు చదువు గురించి ఎలాంటి బెంగా పెట్టుకోవద్దు. నార్మల్‌ గా చదువుకుంటే చాలు. కానీ - కర్నాటిక్ క్లాసికల్ మ్యూజిక్‌ ని ప్రాపర్‌ గా నేర్చుకోమని చెప్పారు. నా పాటలు వినేవారు - సంగీత ప్రియుల ప్రార్థనల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. అంతకుమించి మరేం లేదు.  నేను దాదాపు 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌ లో లైవ్ మ్యూజిక్ చేస్తున్నాను. మధ్యలో కొన్ని క్లాసికల్ కాన్సర్ట్స్ చేసినప్పటికీ లైవ్ మ్యూజిక్ మాత్రం చాలా కాలం తర్వాత చేస్తున్నాను. నా బ్రదర్ అలేఖ్య  లైవ్ మ్యూజిక్ చెయ్యమని చెప్పారు. హైదరాబాద్‌ లో మళ్లీ ఈ కాన్సర్ట్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. ఈ కాన్సర్ట్‌ లో ప్రధానంగా తెలుగు పాటలు పాడతాం. అలాగే కొన్ని తమిళ్ - హిందీ - మలయాళం పాటలు ఉంటాయి`` అన్నారు.

మా నాన్నగారు చనిపోయేవరకు కూడా ఒక్కసారి కూడా నేను బాగా పాడుతున్నానని పొగ‌డ‌లేదు. మన పిల్లల్ని మనమే అప్రిషియేట్ చెయ్యకూడదు. వాళ్ళకు వాళ్ళు ఎదగాలి. మా అబ్బాయి విజయ్ కూడా పాటలు పాడుతున్నాడు. ఇప్పుడొస్తున్న సింగర్స్ చాలా మంది బాగా పాడుతున్నారు. ఇప్పుడు సౌకర్యాలు బాగా పెరిగాయి. ఆరోజుల్లో నేను - సుశీల డ్యూయట్ పాడితే ఒకే మైక్‌ లో ఒకరి తర్వాత ఒకరం పాడేవాళ్లం. కానీ, ఇప్పుడలా కాదు. డిఫరెంట్ ట్రాక్స్ వచ్చేసాయి...అని అన్నారు. ఇక తాను అయ్య‌ప్ప పాట పాడితే క్రిస్టియ‌న్లు చ‌ర్చికి రానివ్వ‌లేద‌ని కఠోర నిజాన్ని ఆయ‌న రివీల్ చేశారు.


Full View

Tags:    

Similar News