హైడర్ మూవీతో బాలీవుడ్ లో సంచలన నటుడిగా గుర్తింపు పొందాడు కే కే మీనన్. ఈయన ఇప్పుడు టాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నాడు. దేశంలోనే మొదటిసారిగా సబ్ మెరైన్ కాన్సెప్ట్ తో వస్తున్న గాజీ మూవీలో నటిస్తున్నాడు మీనన్. తెలుగు-హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించే ఛాన్స్ రావడం తన అదృష్టం అని చెబుతున్నాడు.
1971లో ఇండో పాక్ వార్ సందర్భంగా మునిగిపోయిన సబ్ మెరైన్ పీఎన్ఎస్ ఘాజీని బేస్ చేసుకుని ఈ స్టోరీ రాసుకున్నాడు డైరెక్టర్. ఈ స్టోరీ అద్భుతంగా ఉందని, తను ఈ మూవీలో నావల్ కమాండర్ రన్విజయ్ సింగ్ గా నటిస్తున్నట్లు చెప్పాడు. ట్యాంక్ బండ్ సమీపంలో వేసిన సబ్ మెరైన్ సెట్ చాలా అద్భుతంగా ఉందని చెప్పాడు కేకే మీనన్. దీన్ని చూశాక.. ఈ పాత్ర కోసం ఎక్కువగా పరిశోధన చేయాల్సిన అవసరం లేదని అనిపించిందని వివరించాడు.
గాజిలో దగ్గుబాటి రాణా ప్రధాన పాత్ర చేస్తుండగా.. అసలు ఈ ఆఫర్ వచ్చిన తీరును వివరించాడు మీనన్. 'మంచి స్క్రిప్ట్, ఎక్కువ డబ్బు, సూపర్బ్ రోల్.. వీటిలో ఏది నన్ను శాటిస్ఫై చేసినా నేను ప్రాజెక్ట్ ఒప్పుకుంటా. కానీ గాజితో నాకు అన్నీ దక్కాయి. తెలుగు ఇండస్ట్రీలో ప్రవేశం ఇంత మంచి సినిమాతో కావడం నా అదృష్టం' అన్నాడు కేకే మీనన్. అయితే, ఇక్కడే సెటిల్ అయిపోయే ఉద్దేశ్యం మాత్రం లేదట.