భలే మంచి బేరాన్ని ఫిక్స్ చేసారు

Update: 2018-09-17 15:12 GMT
శైలజారెడ్డి అల్లుడు రిపోర్ట్స్ టాక్ సంగతలా ఉంచితే కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యేలా మారుతీ దాన్ని తీర్చిదిద్దిన తీరు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతోంది. ఇప్పుడు మారుతీ దర్శకత్వంలో కాదు కానీ రచన ప్లస్ నిర్మాణంలో వస్తున్న మరో సినిమా భలే మంచి చౌక బేరముపై మెల్లగా అంచనాలు పెరుగుతున్నాయి. మురళి శర్మ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో నవీద్-కేరింత నూకరాజు-యామిని భాస్కర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. గతంలోనే విడుదలైన ట్రైలర్ మంచి స్పందన దక్కించుకుంది. శత్రు దేశమైన పాకిస్థాన్ కు సంబంధించిన ఒక కీలకమైన రహస్యం చుట్టూ కామెడీగా అల్లుకున్న తీరు ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటోంది. దీనికి కెకె రాధా మోహన్ సమర్పకులుగా వ్యవహరించబోతున్నారు. అక్టోబర్ 5న విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆడియో లేదా ప్రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇప్పటి దాకా పాకిస్థాన్ తో ముడిపడిన భారతీయ సినిమాలన్నీ చాలా సీరియస్ గా సాగినవే. మొదటిసారి ఎంటర్ టైనింగ్ గా రూపొందిన భలే మంచి చౌక బేరములో సీనియర్ ఆర్టిస్టులు కూడా చాలానే ఉన్నారు. రవి నంబూరి మాటలు అందించిన ఈ మూవీకి హరి గౌరా సంగీత దర్శకుడు. రాజా రవీంద్ర చాలా కీలకమైన పాత్రలో కనిపిస్తున్నాడు. దేశ రహస్యాల ఫైల్ ను శత్రువులకు అమ్మెందుకు ప్రయత్నించిన ఇద్దరు హీరోలకు అనుకోకుండా 30 కోట్ల బేరం తగులుతుంది. మరి ఆ రహస్యాలను అమ్ముకుని ద్రోహం చేసారా లేక కర్తవ్యం తెలుసుకుని ముష్కరుల ఆట కట్టించారా అనేదే భలే మంచి చౌక బేరము థీమ్. దసరా పండుగకు భారీ సినిమాల పోటీ మధ్య విడుదలవుతున్న భలే మంచి చౌక బేరములో కంటెంట్ ప్రేక్షకులను మెప్పిస్తుందని సమర్పకులు రాధామోహన్ తో పాటు నిర్మాతలు మారుతీ సతీష్ కుమార్ లు గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News